Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» రిబాండర్

రిబాండర్ - రాజుల ఓడరేవు !

9

పాణజిం చుట్టుపక్కల ప్రదేశాలనే ఇల్లాస్ జిల్లాగా చెపుతారు. దీనినే ఇపుడు రిబాండర్ అంటున్నారు. ఈ పేరు ఓడరేవులకు రారాజు అయిన బందర్ నుండి ఏర్పడింది. రిబందర్ ఏ రాజు నిర్మించాడనేది ఇంకా తెలియదు కాని, ఈ ప్రాంతం గురించి చెప్పాలంటే ఎంతో చరిత్ర కలదు.

అనేక చక్కటి చర్చిలు మరియు ఆసియాలోనే మొదటి హాస్పిటల్ మరియు గోవా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ వంటివి కలవు. సాయంకాల సమయంలో అక్కడ కల వంతెనలపై నుండి రిబాందర్ దర్శిస్తే, పచ్చటి ప్రదేశంగా కనపడుతూ ఆకర్షణీయంగా ఉంటుంది. వాణిజ్య పర చర్యలకు దూరంగా ఉంటుంది. రిబందర్ గోవాలోని ప్రఖ్యాత ఫాదర్ ఆంటోనియో ఫ్రాన్సిస్కో జావియర్ అల్వారేస్ కు కూడా అనుబంధం కలిగి ఉంది. ఈ ఫాదర్ ను సెయింట్ మేరీ ఆర్తోడాక్స్ సిరియన్ చర్చిలో  సమాధి చేశారు.  రిబాండర్ మండోవి నది ఒడ్డున కలదు. దీనిని చేరటం చాలా తేలిక. కావలసినన్ని వంతెనలు ఈ టవున్ షిప్ ను గోవాకు కలుపుతాయి. ఒక క్యాబ్ అద్దెకు తీసుకుని చేరిపోవచ్చు. పరిసరాలను ఆనందించాలన్నా, తాజాగాలి అనుభవించాలన్నా లేదా ఇక్కడకల దేవాలయాలు, చర్చిలు చూడాలన్నా ఒక బైక్ అద్దెకు తీసుకొని స్వంతంగా చూసి ఆనందించండి. 

రిబాండర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

రిబాండర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం రిబాండర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? రిబాండర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం రోడ్డు ప్రయాణంలో ముంబై - గొవా రహదారి లేదా నేషనల్ హై వే 17 ముంబై నగరాన్ని గోవాకు నేరుగా కలుపుతుంది. రోడ్డు రెండు లేన్లు మాత్రమే కలిగి ఉండి కొద్దిపాటి అసౌకర్యంగా ఉన్నప్పటికి, ఆలస్యం అవుతున్నప్పటికి పర్యాటకులు దీనినే ఇష్టపడతారు. సౌకర్యవంతమైన రోడ్డు ప్రయాణం అంటే, ముంబై నుండి 8 లేన్ల ఎక్స్ ప్రెస్ మార్గంలో పూనే చేరి సతారా హై వే లో సావంత్ వాడి వరకు ప్రయాణించవచ్చు. అక్కడినుండి గోవా కొద్ది నిమిషాలలో చేరుకోవచ్చు. మహారాష్ట్ర లోని ముంబై, పూనే మరియు ఇతర నగరాలనుండి గోవాకు సౌకర్యవంతమైన బస్సులు కలవు. ఓల్వో సెమీ స్లీపర్ బస్సులు సౌకర్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం గోవా దేశంలోని ఉత్తర, దక్షిణ మరియు మధ్య ప్రాంతాలకు రైలు సౌకర్యం కలిగి ఉంది. పర్యాటకులు ముంబై నుండి గోవా చేరేందుకు అనుకూలమైన వేళలున్నందున రైలు ప్రయాణం ఎంపిక చేస్తారు. ఒక్క రాత్రి ప్రయాణంలో గోవా చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం దక్షిణ గోవాలోని డబోలిం విమానాశ్రయం నుండి ముంబై, ఢిల్లీ మరియు బెంగుళూరు వంటి మహానగరాలకు విమాన సౌకర్యం కలదు. విమానాశ్రయం నుండి క్యాబ్ లు తేలికగా దొరుకుతాయి. డబోలిం అంతర్జాతీయ లేదా కస్టమ్స్ ఎయిరో పోర్టు కాదు కనుక విదేశీ పర్యాటకులు దేశంలోని అంతర్జాతీయ విమానాశ్రయాలు కల ముంబై లేదా ఢిల్లీ ల ద్వారా గోవా చేరాలి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed