కైల దేవి ఆలయం, రాజస్తాన్ లోని కరౌలి జిల్లా లో సవాయి మాధో పూర్ కు ప్రక్కన గల పురాతన దేవాలయం.సవాయి మాధో పూర్ చూడటానికి వచ్చే అనేక మంది పర్యాటకులు చారిత్రిక ధార్మిక ప్రాముఖ్యత కల్గిన కైల దేవి ఆలయాన్నికూడా సందర్శిస్తారు. సవాయి మాధో పూర్, కరౌలి ల మధ్య తిరిగే బస్సులు లేదా టాక్సీల ద్వారా ఇక్కడికి సులభంగా చేరవచ్చు.
ఈ దేవాలయం కరౌలిను పాలించిన జడౌన్ రాజపుత్రుల కులదైవమైన కైల దేవి కి చెందినది.అందమైన తెల్లని పాలరాయిని ఈ దేవాలయ నిర్మాణానికి వాడారు. ప్రధాన దేవాలయపు ప్రాంగణం అంతటా అద్వితీయ వర్ణాలు గల బండలను పరిచారు. ఈ దేవాలయ౦ లోని ఒక మూలలో భక్తులు పెద్ద సంఖ్యలో ఎర్ర జెండాలను పాతడం ఈ దేవాలయపు మరొక ప్రత్యెక లక్షణం.
ఒకప్పుడు ఈ దేవత ఆశీస్సుల కోసం భక్తులు, తీర్థయాత్రికులు కాలి నడకన ఈ దేవాలయానికి వచ్చేవారు. ప్రస్తుతం ప్రతి సాయంత్రం దేవాలయ ప్రాంగణంలో జరిగే మేలుకొలుపు ఇక్కడి ప్రధాన ఆకర్షణలలో ఒకటి.



Click it and Unblock the Notifications