రామేశ్వరం ఘాట్ రామేశ్వరం ఘాట్ సవాయి మాధో పూర్ కు 50 కిలోమీటర్ల దూరంలో చంబల్, బనస్ నదులు సంగమించిన ప్రాంతంలో ఉంది. ఇక్కడి రమణీయ దృశ్యాలు, వన్య ప్రాణులు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. ప్రతి సంవత్సరం అనేక పక్షులు ఇక్కడకు వలస వచ్చినందున వన్యప్రాణి ఔత్సాహికులకు వాటిని చూసే అద్భుతమైన అవకాశం కల్గుతుంది.
రెండు నదుల నీరు గల రామేశ్వరం ఘాట్ లో చేపలు, మొసళ్ళు, అంతరించి పోతున్న నదీ డాల్ఫిన్ల వంటి అనేక రకాల జల ప్రాణులు కలవు. సమీపంలో అనేక పురాతన దేవాలయాలు ఉండటం కూడా రామేశ్వరం ఘాట్ ను పర్యాటకులు సందర్శించడానికి గల మరొక కారణం.



Click it and Unblock the Notifications