సవాయి మాన్ సింగ్ అభయారణ్యం ఆరావళి, వింధ్య పర్వత శ్రేణులు రెండూ కలిసే ప్రాంతంలో సవాయి మాధో పూర్ లోని ప్రధాన పర్యాటక ఆకర్షణ లలో ఒకటైన సవాయి మాన్ సింగ్ అభయారణ్యం ఉంది. ప్రధాన నగరానికి 9 కిలోమీటర్ల దూరంలో గల ఈ అభయారణ్యంలో విభిన్న రకాల జీవ జాలాలు, అరుదైన జాతులకు చెందిన వృక్షాలు, జంతువులూ ఉన్నాయి.
సవాయి మాన్ సింగ్ అభయారణ్యం సిరాస్, జామున్, కడయా, అమల్టాస్, కదంబ్, గోయ ఖైర్, ఖైర్, చీల, రౌని, తెండు, గుర్జన్, ఖిర్ని, సింత, సాలార్, కథ్ ఫడి వంటి వృక్ష సంపదను కల్గి ఉంది. అంతేకాక వృక్ష సంపదతో బాటుగా ఈ అభయారణ్యంలో వన్య మృగ ప్రియులకు ఆనందానిచ్చే చాలా రకాల జంతువులు కూడా ఉన్నాయి.
చిరుత పులులు, అడవి పిల్లుల వంటి పిల్లి జాతి తో బాటుగా చింకార, నిల్గై, అడవి పంది, జింకలు, తోడేళ్ళు, కుందేళ్ళు, హైనాలు, సంబార్లు వంటి జంతు జాతులు కూడా ఈ అభయారణ్యం లో ఉన్నాయి. ప్రసిద్ధ పక్షి రకాలు - పరిఘి పిట్టలు, మినివెట్లు, రాబందులు, ఫ్లై క్యాచర్లు, అడవి కోడి, నెమళ్ళు, గిజిగాడు పక్షి, చిలకలు, పిచ్చుకలు, క్రౌ౦చ పక్షులు ఈ అభయారణ్యం లో ఉన్నాయి.



Click it and Unblock the Notifications