వాడుక భాషలో 'పాలసు' గా పిలువబడుతున్న మాధవ్ విలాస్ పాలసు మూర్తీభవించిన పరమాద్భుతం. అందమైన టరేట్స్, అనేకమైన టెర్రస్ లు ఇంకా అద్భుతమైన పాలరాతి నేలలతో ఈ పాలసు ఇప్పటికీ ఆకర్షణీయమైన పర్యాటక ప్రదేశం. ఈ పాలసు వెలుపల డస్టీ రోజ్ వర్ణం ఈ పాలసు ని మిగతా పరిసరాల నుండి ప్రత్యేకంగా నిలబడుతుంది.
కలోనియల్ నిర్మాణ శైలి కల ఈ పాలస్ అంతకు ముందు శకాలలో నిర్మించిన పాలసు ల కంటే ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. సిండియా ల యొక్క వేసవి పాలసు గా ఇది వ్యవహరించేది. ఈ పాలసు లో ని టరేట్స్ ఇంకా టెర్రస్ ల నుండి వీక్షణం అప్పటి లాగే అందంగా ఉండేందుకు ప్రత్యేక శ్రద్ద వహించి పరిసరాల అందాలని పరిరక్షించిన మాధవ్ నేషనల్ పార్క్ ని మెచ్చుకోకుండా ఉండలేము.
టెర్రస్ పై రోజంతా వేటకి వెళ్ళిన రాకుమారుడి కోసం ఎదురు చూస్తున్న రాజ మహిళ ప్రతిమ చిత్రకారుడి పనితనానికి నిదర్శనం. ప్రస్తుతం ఈ పాలసు భారత ప్రభుత్వం యొక్క ఇంటలిజెన్స్ బ్యూరో కు శిక్షణ కేంద్రం గా వ్యవహరిస్తోంది.