గ్వాలియర్ నుండి శివపురి కి వెళ్ళే దారిలో ఉన్న హిందువుల పవిత్రమైన స్నానాల ప్రాంతం పనిహర్. గ్వాలియర్ నుండి 20 కిలోమీటర్ల దూరం లో ఉన్న ఈ ప్రాంతం స్థానికులకి అలాగే పర్యాటకులకి పవిత్రమైన స్నానాల ఘాట్. హిందూ ఆచారాల ప్రకారం ఇక్కడి స్నానం కేవలం శరీరాన్ని మాత్రమే కాకుండా మనస్సుని కూడా శుభ్రపరుస్తుంది అని అంటారు.
ప్రపంచం లో ని వివిధ సంస్కృతుల లాగానే మనస్సుని శుభ్రపరచుకోవడం అంటే ఆ పరమాత్మను చేరుకోవడం అనే అర్ధం. పనిహర్ నుండి పచరై, శ్రీ శాంతినాథ్ దిగంబర్ జైన్ అతిశయ క్షేత్ర ఇంకా శ్రీ పచరై తీర్థ కు పర్యాటకులు చేరుకుంటారు. ఈ యాత్ర మానసిక ప్రశాంతత తో పాటు చక్కటి ఆహారాన్ని కూడా అందిస్తుంది. ఈ ప్రాంతం తీపి పదార్ధాలకు పేరుగాంచినది. గ్వాలియర్ కి శివార్లలో ఉన్న శిర్సొద్ గ్రామం 'ఖీర్' అనే తీపి పదార్ధానికి పేరుగాంచినది.