సికార్ నుండి 54 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం రాంగర్. 1791 వ సంవత్సరంలో రావ్ రాజా దేవి సింగ్ ఈ పట్టణాన్ని నిర్మించారు. ఇది అనేక సమాధులకు, ఆలయాలకు, హవేలీలకు, సాంప్రదాయ హస్త కళలకు ప్రసిద్ది చెందింది. పర్యాటకులు ఇక్కడ రామ్ గోపాల్ పోద్దార్ సమాధి, తారా చ౦ద్ ఘనశ్యామ్ దాస్ పోద్దార్ హవేలీ, బైజ్ నాద్ రుహియ హవేలీ, రామ్ గోపాల్ పోద్దార్ హవేలీ, గోపి రామ్ బగరియ హవేలీ లను చూడవచ్చు.
ఇవేకాకుండా, మోతిలాల్ సంవైక హవేలీ, శని దేవ్ ఆలయం, గంగ ఆలయం, బాలాజీ ఆలయం, మాన్ జి ఖేమ్కా హవేలీ లు ఈ ప్రాంతంలో గుర్తించదగ్గ ఇతర పర్యాటక ఆకర్షణలు.



Click it and Unblock the Notifications