ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కొన్షియస్నెస్ యొక్క శ్రీ కృష్ణుని దేవాలయం సిల్చార్ మధ్య ముఖ్య ప్రదేశం లోని అంబిక ప్యాట్టి లో ఉన్నది .పర్యాటకులకు మరియు స్థానికులకు ఈ దేవాలయం ఒక ముఖ్య ఆకర్షణ గా ఉన్నది. ఈ దేవాలయం లో కృష్ణుడు , రాధ విగ్రహాలతో పాటు గౌడియ వైష్ణవ (చైతన్య మహాప్రభు ) విగ్రహం కూడా ఉన్నది . 50 అడుగుల ఎత్తు ఉంది ఈ ప్రదేశం లో ని ఈ కృష్ణాలయం తన నిర్మాణ శైలి కి కుడా ప్రసిద్ది .
ప్రతి ఏటా జన్మాష్టమి మరియు దుర్గా పూజ సమయాన వేలాది మంది భక్త జనాన్ని ఈ ఆలయం ఆకర్షిస్తుంది. ఆ సమయాన భక్తులకు పవిత్ర ప్రసాదాన్ని ఆలయ ప్రాంగణాన అందిస్తారు . ఈ ఆలయ సాధువులు పేద ప్రజలకు సహాయాన్ని అందించటం వంటి మనవ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు . ప్రతి రోజు ఇక్కడ భక్తులకు అందించే శాఖాహార భోజనం ఈ దేవాలయ మరొక గొప్ప ఆకర్షణ .



Click it and Unblock the Notifications