సిల్చార్ కి 80 కి మీ దూరం లో ఉన్న గ్రామం జతింగా . ఒక జానపద కథ ఆధారంగా ఇక్కడ పక్షుల ఆత్మహత్యల తో ఈ గ్రామం పేరు గడించింది . సైంటిఫిక్ అధ్యయనం ఇవి ఆత్మహత్యలు కాదు హత్యలు అని తెలియచేస్తుంది . శరత్ కాలం అమావాస్య దినాలలో వెలుతురు లేని సమయాన ఈ లోయ లో ఎగిరే పక్షులు దిశ తప్పుతాయి. స్థానికులు లైట్లతో వీటిని ఆకర్షించి వెదురు బొంగు ల తో చంపి తింటారు.
అస్సాం లో ని జతింగా గ్రామం ఏంతో మంది పర్యాటకులని ఆకర్షించే ప్రదేశం గా పేరుగాంచింది. అంతే కాక, ఇది ఒక హిల్ స్టేషన్ గా కూడా ప్రసిద్ది. అందమైన ప్రకృతి పర్వతాల మధ్య ప్రశాంత వాతావరణం కలిగి ఉంటుంది. స్థానిక కళా వస్తువులను కొనుక్కునే అవకాశం కూడా ఉన్నది.



Click it and Unblock the Notifications