Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తమెంగ్‌లాంగ్

తమెంగ్‌లాంగ్ - అడవులు మరియు అన్వేషించబడని ఆకర్షణీయమైన కొండలు గల భూమి !

11

తమెంగ్‌లాంగ్ ఒక కొండ జిల్లా. తమెంగ్‌లాంగ్ మొత్తం కొండలు, లోయలు మరియు శ్రేణులతో కూడి ఉంటుంది. తమెంగ్‌లాంగ్ ఒక అందమైన జిల్లా. ఇది మణిపూర్ లో ఉన్నతొమ్మిది జిల్లాలలో ఒకటిగా ఉంది. తమెంగ్‌లాంగ్ సహజమైన మరియు సంస్కృతులకు పూర్తి వైవిధ్యం కలిగి ఉన్నఒక అద్భుతమైన జిల్లా. తమెంగ్‌లాంగ్ అరుదైన ఆర్కిడ్లు, అడవులు, పక్షులు మరియు జంతువుల అరుదైన జాతులకు ఆవాసంగా ఉన్న హార్న్బిల్ యొక్క భూమి అని అంటారు. తమెంగ్‌లాంగ్ మణిపూర్ పశ్చిమంగా ఉంది. తమెంగ్‌లాంగ్ కు తూర్పు మరియు ఉత్తరాన సేనాపతి జిల్లా, దక్షిణాన చురచంద్పూర్, పశ్చిమాన ఇంఫాల్ మరియు అస్సాంలో కొన్ని భాగాలు సరిహద్దులుగా కలిగి ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం తమెంగ్‌లాంగ్ మణిపూర్ లో అత్యల్ప జనాభా కలిగిన జిల్లాగా ఉంది.

కొండలు మరియు శ్రేణులు మధ్య ఉన్న చిన్న కుగ్రామాల దగ్గర ఆధ్యాత్మిక సౌందర్యం పెరుగుతున్న లోయలు చుక్కల్లా ఉంటాయి. తమెంగ్‌లాంగ్ యొక్క నైసర్గిక స్వరూపం ఇసుకరాయి, తేలికగా విడిపోవు రాతి శిల మరియు పగుళ్ళు కలిగి ఉండుట వల్ల నేల మరియు రాళ్లను బలహీనపరుస్తుంది. దాని ఫలితంగా అక్కడ క్రమం తప్పకుండా కొండచరియలు విరిగిపడటం జరుగుతుంది.

తమెంగ్‌లాంగ్ మరియు పరిసరాలలోని పర్యాటక ప్రదేశాలు

బరాక్ నది మరియు ఏడు జలపాతాలు,తరాన్ గుహ,జేలాద్ లేక్ మరియు బునింగ్ మేడో మొదలైనవి తమెంగ్‌లాంగ్ లో ముఖ్యమైన పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి. బయో డైవర్సిటి కేంద్రం

బయో డైవర్సిటి కేంద్రం పక్షులు మరియు జంతువులు అనేక దేశీయ,పరదేశీయ మరియు అరుదైన జాతులకు నిలయంగా ఉన్నది. పర్యాటకులు హాగ్ లేడి, నెమళ్లు, అడవి పందులు, అడవి కుక్కలు, హైనాలు, చిరుతపులులు వీక్షించడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పులులు అడవిలో చాలా ప్రాంతాన్ని కవర్ చేస్తూ కనిపిస్తుంటాయి. అడవులు మూడు రకాలుగా ఉష్ణమండల సతత హరిత అడవులు, వెదురు బ్రేక్లు మరియు ఉప ఉష్ణమండలీయ అరణ్యాలుగా ఉన్నాయి. వీటిని వేరుచేసి చూడవచ్చు.

తమెంగ్‌లాంగ్ లో ప్రదానంగా జేలింగ్రోంగ్ నాగాలు మరియు కుకిస్ గిరిజన జనాభా కలిగి ఉన్నారు. ఇక్కడ అనేక పండుగలను జరుపుకుంటారు. వాటిలో ఆరెంజ్ ఫెస్టివల్ ,రిహ్-నగై (చాగ నగై), గుడు నగై, బంరుహ్మే మరియు తరంగ మొదలైన పండుగలు ఉంటాయి.

 వాతావరణము

తమెంగ్‌లాంగ్ లో వేసవి, వర్షాకాలం మరియు శీతాకాలాలు మూడు కాలాలతో ఉష్ణమండలీయ వాతావరణాన్ని కలిగి ఉంటుంది.

తమెంగ్‌లాంగ్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తమెంగ్‌లాంగ్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తమెంగ్‌లాంగ్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తమెంగ్‌లాంగ్

  • రోడ్డు ప్రయాణం
    రైలు మార్గం మణిపూర్ లో రైల్వేస్టేషన్ లేదు కాబట్టి సమీప రైల్వే స్టేషన్ డిమాపూర్ ఉంది. తమెంగ్‌లాంగ్ చేరుకోవటానికి పర్యాటకులు ఇంఫాల్ ద్వారా ప్రయాణం అవసరం. డిమాపూర్ ఇంఫాల్ నుండి 215 కిలోమీటర్ల దూరంలో ఉంది.అక్కడ నుండి తమెంగ్‌లాంగ్ చేరుకోవడానికి మరో 158 కిలోమీటర్ల ప్రయాణం అవసరం. తమెంగ్‌లాంగ్ చేరుకోవడానికి ఇంఫాల్ మరియు డిమాపూర్ రెండింటి నుండి సాధారణ వాహనాలు అందుబాటులో ఉన్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రోడ్డు మార్గం జాతీయ రహదారి 53 మరియు జాతీయ రహదారి 39 దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి మణిపూర్ కు అనుసంధానం కలిగి ఉంది. తమెంగ్‌లాంగ్ చేరుకోవడానికి పర్యాటకులు పురాతన కాచార్ రోడ్ మరియు తమెంగ్‌లాంగ్ ఖొంగ్సంగ్ రోడ్ NH53 ద్వారా ప్రయాణించవచ్చు. ఇంఫాల్ నుండి తమెంగ్‌లాంగ్ చేరుకోవడానికి రాష్ట్ర రవాణా బస్సులు నడపబడుతున్నాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం తమెంగ్‌లాంగ్ కు సమీపంలో ఇంఫాల్ విమానాశ్రయం ఉన్నది. ఈ విమానాశ్రయం రాజధాని నగరం నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే తమెంగ్‌లాంగ్ నుండి ఇంఫాల్ 158 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇంఫాల్ విమానాశ్రయం నుండి ప్రతి రోజు దేశం యొక్క మిగిలిన ప్రాంతాలకు అనుసంధానించబడి ఉంటుంది. విమానాశ్రయం నుండి తమెంగ్‌లాంగ్ చేరుకోవటానికి వాహనాలు సులభంగా అందుభాటులో ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue