ప్రాచీన కాలంలో తలసేరి కి సుగంధ ద్రవ్యాల వాణిజ్యంలో వున్న ప్రాముఖ్యానికి ప్రతీకగా నిలుస్తుంది రందత్తర సినమోన్ ఎస్టేట్. కోస్తా తీరంలోని ఈ పట్టణం మిరియాలు, అల్లం, పసుపు లాంటి సుగంధ ద్రవ్యాలను బ్రిటిష్ వారు నిర్మించిన రేవు ద్వారా విదేశాలకు వర్తకం చేసే కేంద్రంగా ఉండేది.
1790లలో టిప్పు సుల్తాన్, హైదర్ అలీ, పలాసి రాజా తో జరిగిన యుద్ధాల వల్ల తలసేరి లో సుగంధ ద్రవ్యాల వాణిజ్యం దెబ్బతింది. నేరుగా సుగంధ ద్రవ్యాలను సాగు చేసే ఉద్దేశ్యంతో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ స్వంతంగా ఒక తోటను స్థాపించింది. ఈ టోటల్ రందత్తర లో పెంచడంతో దీన్ని తర్వాతి కాలంలో రందత్తర సినమోన్ ఎస్టేట్ అన్నారు.
1000 ఎకరాల్లో విస్తరించిన ఈ తోటలో – విల్లియం లోగాన్ (ప్రసిద్ధ బ్రిటిష్ చరిత్రకారుడు) చెప్పిన ప్రకారం కాఫీ, మిరియాలు, దాల్చిన చెక్క, జాజికాయ, పట్టి లాంటివి ఇక్కడ పండించేవారు. ఈ ప్రాంతపు వృక్ష సంపదను చూడడానికి పర్యాటకులకు ఇది సరైన ప్రదేశం.



Click it and Unblock the Notifications