ఆర్యంకావు ప్రదేశాన్ని వ్యాలీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ రేంజ్ అంటారు. కొల్లం జిల్లా కు తూర్పు దిశగా 75 కి.మీ. దూరంలో కలదు. తేన్మలై కు సమీపంలో కల ఆర్యంకావు గ్రామం జిల్లాలోని ప్రదాన ఆకర్షణలలో ఒకటి. ఆర్యంకావు లోని ప్రధాన ఆకర్షణ పాలరువి జలపాతాలు. ఈ క్షేత్రం లేడి సెయింట్ మేరీస్ రోమన్ కేథలిక్ చర్చి మరియు జార్జ్ మలంకర కాథలిక్ చర్చి భక్తులను ఆహ్వానిస్తుంది. ఆర్యంకావు శాస్త దేవాలయంలో స్వామి ఆయప్ప ప్రధాన దైవం. మతపరంగానే కాక ఈ ప్రదేశం ఒక పర్యాటక ప్రదేశంగా కూడా పేరుపడింది. ఇక్కడి దైవానికి జరిగే మండల పూజ సమయంలో వేలకొలది భక్తులు ఇక్కడకు వస్తారు. .ఆర్యంకావు సమీపంలో కమదనపర శాండల్ ఫారెస్ట్ కలదు. ఇది ఈ గ్రామంలో ఇది అతిపెద్ద గంధపు అడవి. ఆర్యన్ కావు నుండి రోజ్ మేళ 11 కి.మీ. దూరంలో ఉంటుంది. ఇది ఒక ఎకో టూరిజం ప్రదేశం. ఈ రకమైన వివిద ఆకర్షణలతో ఆర్యంకావు పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications