ముతుపెట్టై లేదా ముతుపేట్, తమిళనాడు లోని తిరువరూర్ జిల్లలో ఉన్న ఒక పంచాయతీ పట్టణం. ఫిషింగ్ కి సరైన ప్రదేశంగా ఉన్న ఈ పట్టణం ఉప్పునీటి చెరువులకు, మడ అడవులకు ప్రసిద్ది చెందింది. ఇది కావేరీ డెల్టా దక్షిణపు కోణంలో ఉంది, సముద్రానికి సమీపంలో ఉండడం వల్ల అనుకూలమైన వాతావరణాన్ని కలిగిఉంటుంది. ముతుపేట్, రాష్ట్ర రాజధాని చెన్నై నుండి దాదాపు 360 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది తిరుట్టురైపూండి, పట్టుక్కోటై మధ్యలో ఉంది. ముతుపెట్టై లో ఉన్న భారతదేశంలోని అతిపెద్ద మడ అడవులలో అలయతి కడు ఒకటి. ఇది ముత్యాల వేటకి ఉత్తమమైన ప్రదేశం. ముతుపేట్ కి తంజావూర్, కరైకల్, కుంబకోణం వంటి ప్రాంతాలలోని పట్టణాలు, అన్ని ప్రధాన నగరాల నుండి తేలికగా చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications