Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» తిరువత్తర్

తిరువత్తర్ – పవిత్ర భూమి!

10

దక్షిణ తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో నిశబ్దంగా ఉన్న ఒక దివ్య, పవిత్ర భూమి తిరువత్తర్, ఇది ఒక చిన్న పంచాయతి పట్టణం. ఇది హిందువుల 108 దివ్యదేశాలలో ఒకటి అయినందున హిందూ తీర్థయాత్రికులు తప్పనిసరిగా సందర్శించవలసిన పట్టణం.

దీని ధార్మిక ప్రాధాన్యతతో బాటుగా, ఈ పట్టణం అందమైన దృశ్యాలతో కనువిందు చేయడం వలన పర్యాటక గమ్యస్థానంగా పేరుపొందింది. ఈ పట్టణం పొడవు మేరా ప్రవహించే పహ్రాలి, కోథాయి అనే రెండు నదుల నడుమ తిరువత్తర్ ఉంది. నిజానికి, ఈ ప్రాంతానికి దాని పేరు ఈ రెండు నదులు మూవట్టుముగం దగ్గర కలియడం వలన వచ్చింది; ‘తిరు’ అంటే తమిళంలో పవిత్రం అని అర్ధం, ‘వట్ట’ చుట్టూ అనే పదానికి తమిళ అర్ధం, అరు అనేది నదికి తమిళ పదం. ఇలా, తిరువత్తర్ అంటే చుట్టూ నదులు ఉన్న పవిత్ర ప్రాంతం.

తిరువత్తర్ లో ప్రధాన ఆకర్షణ దివ్యమైన పవిత్ర శ్రీ ఆదికేశవ పెరుమాళ్ ఆలయం, ఈ ఆలయం ఉండటం వలన ఈ పట్టణానికి దివ్యత్వం వచ్చింది. మథూర్ హ్యంగింగ్ బ్రిడ్జి, సెయింట్ జేమ్స్ చర్చి (వంద ఏళ్ళ నాటిది), ఉదయగిరి కోట, తిరువత్తర్ పట్టణం నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న తిర్పరప్పు జలపాతాలు తిరువత్తర్ పట్టణంలో ఇతర ప్రసిద్ధ, తరుచు పర్యాటకులు సందర్శించే ప్రాంతాలు. ఈ పట్టణం హిందువుల తీర్థయాత్ర కేంద్రమైనందున, దేశంలోని ఇతర ప్రాంతాలకు రోడ్ల ద్వారా చక్కటి అనుసంధానాన్ని కల్గించడానికి ప్రయత్నాలు చేపట్టారు.

కన్యాకుమారిలో అతి దగ్గరి రైలు స్టేషన్ ఉంది, తిరువంతపురంలో అతి దగ్గరి విమానాశ్రయం ఉంది. తీర్థయాత్రికులు, పర్యాటకులు వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండే శీతాకాలంలో ఈ పట్టణాన్ని సందర్శించడానికి ప్రాధాన్యత నిస్తారు. వేసవి చెమట పట్టిస్తూ వేడిగా ఉండగా, వర్షాకాలంలో ఈ ప్రాంతంలో వచ్చే తుఫానుల కారణంగా ప్రయాణించడం కష్టమౌతుంది.

తిరువత్తర్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

తిరువత్తర్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం తిరువత్తర్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? తిరువత్తర్

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం ద్వారా కన్యాకుమారి, నాగర్ కోయిల్ ల నుండి రోడ్డు మార్గం ద్వారా తిరువత్తర్ చేరడం చాలా సులువు. తమిళనాడు, కేరళ రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల ప్రధాన నగరాల నుండి తిరువత్తర్ కు బస్సులు నడుపుతాయి. రోడ్లు మంచి స్థితిలో ఉన్నాయి; అందువల్ల బస్సు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటుంది. కన్యాకుమారి నుండి తిరువత్తర్ కు ప్రైవేట్ టాక్సీ సౌకర్యాన్ని కూడా పొందవచ్చు.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం ద్వారా తిరువత్తర్ లో రైలు స్టేషన్ లేదు. అయినప్పటికీ కన్యాకుమారి రైలు స్టేషన్, నాగర్ కోయిల్ రైలు స్టేషన్ పట్టణానికి అతి దగ్గరగా ఉన్నాయి. ఈ రెండు పట్టణాలు దేశంలోని మిగిలిన ప్రాంతాలకు చక్కటి మార్గాన్ని కల్గి ఉండటం వలన దేని నుండైనా మనం రైలు ఎక్కవచ్చు
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    వాయుమార్గం ద్వారా తిరువత్తర్ పట్టణంలో విమానాశ్రయం లేదు. కేరళ రాజధాని తిరువంతపురంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయమే అతి దగ్గరది. తిరువత్తర్ నుండి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం నుండి ఈ ప్రాంతానికి చేరడానికి 3 ½ గంటల సమయం పడుతుంది. విమానాశ్రయం నుండి ఈ పట్టణానికి చేర్చడానికి మీరు ప్రైవేట్ క్యాబ్ లను అద్దెకు తీసుకొనవచ్చు. క్యాబ్ల చార్జీలు రూపాయలు 1000-1500 మధ్య ఉంటాయి.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
01 Apr,Wed
Check Out
02 Apr,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
01 Apr,Wed
Return On
02 Apr,Thu