Search
  • Follow NativePlanet
Share
» »హెరిటేజ్​ ట్రయాంగిల్​ పేరుతో ఐఆర్​సీటీసీ అందిస్తోన్న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌..

హెరిటేజ్​ ట్రయాంగిల్​ పేరుతో ఐఆర్​సీటీసీ అందిస్తోన్న ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌..

ఢిల్లీలో ప‌ర్యాట‌కుల‌కు సంద‌ర్శించేందుకు ప్రసిద్ధిచెందిన ప్ర‌దేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా చారిత్ర‌క క‌ట్ట‌డాలు. ఇక్క‌డి ప్రాంతాల‌ను ప్ర‌త్య‌క్షంగా చూసేందుకు దేశ విదేశాల నుంచి ప‌ర్యాట‌కుల‌కు త‌ర‌లి వ‌స్తుంటారు. ఇంత‌టి దేశ చ‌రిత్ర క‌లిగిన క‌ట్ట‌డాల‌ను చూడాల‌ని చాలామంది అనుకుంటూ ఉంటారు. అలాంటివారికోసం ఇండియ‌న్ రైల్వే క్యాట‌రింగ్ అండ్ టూరిజం ఓ స‌రికొత్త ప్యాకేజీనీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ టూర్ ప్యాకేజీ విశేషాలేంటో తెలుసుకుందాం ప‌దండి.

ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ప్యాకేజీ "హెరిటేజ్​ ట్రయాంగిల్​" పేరుతో ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు కొనసాగనుంది. ఈ ప్ర‌యాణం హైదరాబాద్​ నుంచి మొద‌ల‌వుతుంది. రైలు ప్ర‌యాణం చేయాల్సి ఉంటుంది. ప్రతీ సోమవారం ఈ టూర్ ప్యాకేజీ ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. ఈ టూర్​లో భాగంగా దేశ రాజ‌ధాని ఢిల్లీతో పాటు ఆగ్రా (తాజ్‌మ‌హ‌ల్‌), మథుర వంటి ప్రదేశాలు సంద‌ర్శించొచ్చు.

టూర్ షెడ్యూల్ ఇదే..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్​ నుంచి ప్ర‌యాణం ఉంటుంది. 12723 అనే నెంబ‌ర్‌గ‌ల ట్రైన్ ను ఎక్కాల్సి ఉంటుంది. ఆ రోజంతా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఇక‌, మ‌రుస‌టి రోజు ఉదయం 8 గంటలకు దిల్లీ చేరుకుంటారు. అక్కడి నుంచి టూరిస్టుల‌ను పికప్​ చేసుకుని ముందుగానే బుక్​ చేసిన హోటల్​కు తీసుకెళ్తారు. అక్కడ హోటల్​లో చెకిన్​ అయ్యాక ప్రెష్ అవుతారు. అనంత‌రం దిల్లీలోని కుతుబ్​ మినార్​, లోటస్​ టెంపుల్​, అక్షరధామ్​ వంటి ప్రదేశాలను వీక్షించేందుకు బ‌య‌లుదేరుతారు. ఇక‌, ఈ రోజు నైటంతా ఢిల్లీల‌నే స్టే చేయాల్సి ఉంటుంది.

delhi red fort

మూడో రోజు హోటల్​ చెక్​ అవుట్​ అయ్యాక ఇండియా గేట్​, రెడ్​ ఫోర్ట్ వంటివి సంద‌ర్శిస్తారు. అనంత‌రం ఆగ్రాకు ప‌య‌న‌మ‌వుతారు. సాయంత్రానికి ఆగ్రా చేరుకుని హోటల్​లో చెకిన్​ అవుతారు. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు. నాలుగో రోజు తాజ్​ మహల్ సందర్శ‌న ఉంటుంది. ఆ తర్వాత అక్క‌డి నుంచి ఆగ్రా ఫోర్ట్​కు ప్ర‌యాణం ఉంటుంది. అనంత‌రం మధుర బయలుదేరుతారు. మథురలోని కృష్ణ జన్మభూమి ద‌ర్శ‌నం అనంత‌రం నైటంతా అక్క‌డే ఉండాలి.

ఇక‌, ఐదో రోజు హోటల్​లో చెక్​ అవుట్​ అయ్యి బృందావనానికి ప్ర‌యాణమ‌వుతారు. అదేరోజు మధ్యాహ్నం మథుర జంక్షన్​ రైల్వే స్టేషన్​లో డ్రాపింగ్ ఉంటుంది. సాయంత్రం 5:30 గంటలకు తిరుగు ప్ర‌యాణంలో భాగంగా ఢిల్లీ నుంచి ట్రైన్​ మొద‌ల‌వుతుంది. ఆ నైటంతా ప్ర‌యాణం ఉంటుంది. ఆరోరోజు సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్​ చేరుకోవడంతో ఈ ప్యాకేజీ ముగుస్తోంది.

charminar Hyderabad

ప్యాకేజీ వివ‌రాలివే..

ఈ టూర్ ప్యాకేజీలో భాగంగా ధ‌ర‌ల వివ‌రాలిలా ఉన్నాయి..1 నుంచి ముగ్గ‌రు ప్రయాణికులకు కంఫర్ట్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.41,670 చెల్లించాలి. అదే డబుల్​ షేరింగ్ అయితే​ రూ.24,180 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్​ షేరింగ్​కు రూ.18,970 గా నిర్ణయించారు. చిన్నారుల‌కు కూడా వివిధ రేట్లు అందుబాటులో ఉన్నాయి. ఐదు నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.14,320, విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.12,840 చెల్లించాల్సి ఉంటుంది.

ఇక‌, స్టాండర్డ్​లో సింగిల్​ షేరింగ్​కు రూ.39,270 చెల్లించాలి. అదే డబుల్​ షేరింగ్ అయితే​ రూ.21,340 ఉంటుంది. ట్రిపుల్​ షేరింగ్​కు రూ.16,220 చెల్లించాల్సి ఉంటుంది. 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.11,850 చెల్లించాల్సి ఉంటుంది. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.10,540 గా నిర్ణ‌యించారు.

ప్యాకేజీలో క‌వ‌ర్ అయ్యేవి..

న‌లుగురి నుంచి ఆరుగురు ప్రయాణికులకు వేరు ధ‌ర‌లు ఉన్నాయి. ఇందులో కంఫర్ట్​లో డబుల్​ షేరింగ్​కు రూ.20,440 చెల్లించాల్సి ఉంటుంది. అదే ట్రిపుల్​ షేరింగ్​ అయితే​ రూ.17,590 గా నిర్ణ‌యించారు. ఇక‌, 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.14,320 చెల్లించాల్సి ఉంటుంది. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.12,840 గా నిర్ణ‌యించారు. వీటితో పాటు స్టాండర్డ్​లో డబుల్​ షేరింగ్​కు రూ.17,600 ఉంటుంది. అదే ట్రిపుల్​ షేరింగ్​ అయితే​ రూ.14,830 చెల్లించాల్సి ఉంటుంది.

5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్​ బెడ్​ అయితే రూ.11,850గా నిర్ణ‌యించారు. విత్​ అవుట్​ బెడ్​ అయితే రూ.10,540 చెల్లించాల్సి ఉంటుంది. ఇక‌, ఈ ప్యాకేజీలో ట్రైన్​ టికెట్లతోపాటు హోట‌ల్ అకామిడేష‌న్ మూడు బ్రేక్‌ఫాస్ట్‌లు, ట్రావెల్ ఇన్సూరెన్స్ లోక‌ల్ వెహిక‌ల్స్ అన్నీ క‌వ‌ర్ అవుతాయి. ఐఆర్‌సిటిసి అందిస్తోన్న ఈ ప్యాకేజీ నవంబర్​ 18 వ తేది నుంచి 2025 జనవరి 27వ తేదీ వరకు ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది.

More News

    Read more about: irctc tourism heritage triangle
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+