Search
  • Follow NativePlanet
Share
» »జ్యోతిర్లింగాలలో మొదటిది - ఔంధా నాగనాథ్ !

జ్యోతిర్లింగాలలో మొదటిది - ఔంధా నాగనాథ్ !

By Mohammad

ఔంధా నాగనాథ్ జ్యోతిర్లింగాలన్నింటిలో ప్రత్యేకమైనది. ఇది భారత దేశంలోని 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో మొదటిది. అంతేకాదు మహారాష్ట్ర లోని ఐదు జ్యోతిర్లింగాలలో కూడా ఒకటి. ఈ క్షేత్రం హింగోలీ జిల్లాలో ఉన్న ఒక చిన్న పట్టణం.

స్థలపురాణం

పాండవులలో పెద్దవాడైన యుధిష్టురుడు శివభఫవానుడి రూపంగా ఒక జ్యోతిర్లింగాన్ని, వారు 14 సంవత్సరాల అరణ్యవాస సమయంలో ఉండగా ప్రతిష్టించాడని నమ్ముతారు.

ఔంధా నాగనాథ్ ఆలయం

ఔంధా నాగనాథ్ ఆలయం

చిత్ర కృప : vijay chennupati

ఔంధా నాగనాథ్ దేవాలయం

ఈ దేవాలయం పూర్తిగా హేమద్ పంతి శిల్ప శైలి లో ఉండి శివ భగవానుడి లింగాన్ని కలిగి ఉంటుంది. దేవాలయం సుమారుగా 4000 చ. అ. లలో వ్యాపించి ఉంటుంది. ఈ దేవాలయంలో నంది విగ్రహం అన్ని దేవాలయాల వలె ముందు వైపు కాకుండా ఆలయం వెనక వైపున ఉంటుంది. దేవాలయం చుట్టుపక్కల అనేక ఇతర చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి.

ఆలయ సందర్శన వేళలు

ఉదయం 4 : 00 గుడి తలుపులు తెరుస్తారు. ఆ తరువాత ఉదయం 4:05 పూజ మరియు రుద్రాభిషేకం నిర్వహించి భక్తులను లోనికి అనుమతిస్తారు. మధ్యాహ్నం 12 కు హారతి, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 : 30 కు పూజ, సేవలు నిర్వహించి రాత్రి 9 గంటలకు గుడి తలుపులు మూసేస్తారు.

ఏనుగు శిల్పాలు

ఏనుగు శిల్పాలు

చిత్ర కృప : vijay chennupati

సమీపంలోని సందర్శనీయ స్థలాలు

ఔంధా నుండి 61 కిలోమీటర్ల దూరంలో నాందేడ్ కలదు. ఈ పట్టణం సిక్కుల ప్రముఖ ప్రదేశం. ఈ పట్టణంలో సచ్ ఖండ్ హుజూర్ సాహెబ్ గురుద్వారా కలదు. సిక్కుల గురువైన గురు గోవింద్ సింగ్ అస్థికలు ఇక్కడ సమాధి చేయబడ్డాయి.

పాండవ రాజ ఆలయం ఇక్కడి మరో ప్రధాన ఆకర్షణ. నాందేవ్ మహర్షి కీర్తన పాడుతుంటే ఈ ఆలయం తనంతట తనే తిరిగిందని భక్తుల విశ్వాసం. నాందేవ్ సమీపంలోని బాంని గ్రామానికి చెందినవాడు. ఈయన గురువు ' విసోబా ఖేచర్' ఔంధా నాగనాథ్ కు చెందిన మహర్షి.

అబ్బురపరిచే శిల్పకళాఖండాలు

అబ్బురపరిచే శిల్పకళాఖండాలు

చిత్ర కృప : vijay chennupati

హోటల్/ వసతి

హింగోలి వసతి సౌకర్యాల కొరకై అన్ని విధాలా ఉత్తమమైనది. ఈ పట్టణంలో లాడ్జీలు, హోటళ్లు అందుబాటు ధరల్లోనే లభిస్తాయి. రోజుకి 200 నుండి 350 వరకు అద్దె తీసుకుంటారు.

ఎప్పుడు సందర్శించాలి ?

ఔంధా నాగనాథ్ ను వేసవిలో తప్పనిచ్చి మిగితా అన్ని రోజులలో సందర్శించవచ్చు.

ఉష్ణోగ్రతలు

సమ్మర్ లో 24 డిగ్రీల - 39 డిగ్రీల వరకు

వింటర్ లో 12 డిగ్రీల - 30 డిగ్రీల వరకు

మీరు కనుక హింగోలి వెళ్ళే వారైతే, ఔంధా నాగనాధ్ దేవాలయాన్ని తప్పక చూడాలి. మీ పర్యటన జాబితాలో దీనిని మొదటిదిగా పెట్టుకోండి. ఈ పవిత్ర క్షేత్రం ప్రతి ఒక్కరికి వారిలోని ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది.

vijay chennupati

చిత్ర కృప : vijay chennupati

ఔంధా నాగనాథ్ ఎలా చేరుకోవాలి ?

పర్భానీ, నాసిక్, పూణే, ఔరంగాబాద్ నుండి ప్రతి రోజూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ఔంధా నాగనాథ్ కు నడుస్తుంటాయి.

సమీప ఎయిర్ పోర్ట్ : ఔరంగాబాద్ ఎయిర్ కలదు. ఈ ఎయిర్ పోర్ట్ నుండి ఔంధా నాగనాథ్ కు క్యాబ్ లేదా టాక్సీ లలో ప్రయాణించి చేరుకోవచ్చు.

సమీప రైల్వే స్టేషన్ : పర్భానీ రైల్వే స్టేషన్ కలదు. ఇక్కడి నుండి క్యాబ్ లేదా ప్రభుత్వ బస్సులలో ప్రయాణించి ఔంధా నాగనాథ్ చేరుకోవచ్చు.

ఎక్కడి నుంచి ఎంత దూరం ?

ఔరంగాబాద్ నుండి ఔంధా నాగనాథ్ కు - 197 కిలోమీటర్లు ( రోడ్డు మార్గం)

పర్భానీ నుండి ఔంధా నాగనాథ్ కు - 51 కిలోమీటర్లు ( రోడ్డు మార్గం)

నాసిక్ నుండి ఔంధా నాగనాథ్ కు - 383 కి. మీ (రోడ్డు మార్గం)

నాందేడ్ నుండి ఔంధా నాగనాథ్ కు - 64 కిలోమీటర్లు ( రోడ్డు మార్గం)

More News

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+