Search
  • Follow NativePlanet
Share
» »యుపిలోని ఈ ప్ర‌సిద్ధ న‌గ‌రాల‌ను చూశారా?

యుపిలోని ఈ ప్ర‌సిద్ధ న‌గ‌రాల‌ను చూశారా?

యుపిలోని ఈ ప్ర‌సిద్ధ న‌గ‌రాల‌ను చూశారా?

భారతదేశంలోని అతిపెద్ద రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ ఒకటి. ఇక్కడ అనేక నగరాలు పర్యాటక పరంగా ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. విదేశాల నుంచి వచ్చే పర్యాటకులు కచ్చితంగా ఉత్తరప్రదేశ్ న‌గ‌రాన్ని వీక్షించ‌క మాన‌రు. ఎందుకంటే, ఇక్కడ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటైన తాజ్ మహల్ మరియు భోలేనాథ్ నగరమైన కాశీ కూడా ఉంది. అంతేకాకుండా ఎన్నో పురాత‌న ఆల‌యాలు, చారిత్ర‌క క‌ట్ట‌డాలు కూడా ఉన్నాయి.

సంగం నగరం ప్రయాగ్‌రాజ్ నుండి చారిత్రక నగరం ఝాన్సీ వరకు కూడా ఇక్క‌డ ఎన్నో చార‌త్ర‌క పురాత‌న క‌ట్ట‌డాలు ఉన్నాయి. నవాబుల నగరమైన లక్నోతోపాటు శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్య. బౌద్ధ పుణ్యక్షేత్రం కుషినగర్ మరియు బౌద్ధ క్షేత్రం సారనాథ్ కూడా ఉన్నాయి. వీట‌న్నింటిని సంద‌ర్శించాలంటే త‌ప్ప‌కుండా యుపిని చుట్టేయాల్సిందే. మ‌రెందుకాల‌స్యం యుపికి మీ ప్ర‌యాణాన్నిమొద‌లుపెట్టండి ఇక‌.

tajmahal1

ఆగ్రా

ఆగ్రా ఉత్తర ప్రదేశ్‌లోనే కాదు, భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ నగరాల్లో ఒకటిగా పేరుగాంచింది. ఆగ్రా పేరు విన‌ప‌డ‌గానే మ‌నకు ముందుగా గుర్తుకు వచ్చేది తాజ్ మహల్. మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్థం తాజ్ మహల్‌ను నిర్మించాడు. తెల్ల పాలరాయితో చేసిన తాజ్ మహల్ ప్రపంచంలోని ఏడు వింతలలో ఒకటి. ఈవింత‌ని చూసేందుకు విదేశాల నుంచి ప్రజలు వస్తుంటారు. తాజ్‌మ‌హాల్ కాకుండా ఈ ప్రాంతంలో పాత కోట, మొఘల్ గార్డెన్స్‌తో సహా అనేక చారిత్రక కట్టడాలు ఇక్క‌డ‌ ఉన్నాయి.

varanasi1

వారణాసి

భారతదేశంలోని వారణాసి నగరం ప్రపంచంలోని పురాతన నగరాలలో ఒకటిగా ప్ర‌సిద్ధి చెందింది. వారణాసి గంగానది ఒడ్డున ఉన్న హిందువుల మత విశ్వాసంతో ముడిపడి ఉన్న పవిత్ర నగరం. ఇక్కడ ఉన్న కాశీ విశ్వనాథ దేవాలయం ప్రపంచ ప్రసిద్ధి చెందింది. బనారస్ గంగా ఘాట్‌లు, దేవాలయాలు, మలుపులు తిరిగే మార్గాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు త‌ర‌లి వస్తుంటారు. దశాశ్వమేధ ఘాట్, అస్సీ ఘాట్, భారత్ మాతా మందిర్, BHU క్యాంపస్ వద్ద గంగా హారతిని వీక్షించేందుకు విదేశాలనుంచి కూడా ప‌ర్యాట‌కులు ఇక్క‌డికి త‌ర‌లి వ‌స్తుంటారు.

mathura

మ‌ధుర‌

ఉత్తరప్రదేశ్‌లో ఉన్న ఈ న‌గ‌రం విష్ణువు అవతారమైన శ్రీకృష్ణుని జన్మస్థలం. మధుర నగరం భారతీయులతో పాటు విదేశీయులలో కూడా ప్రసిద్ధి చెందింది. ఎందుకంటే, ఈ ప్రాంతం శ్రీ‌కృష్ణుని జ‌న్మ‌స్థ‌లం అంతేకాకుండా ఇక్క‌డ కృష్ణ జన్మభూమి, ద్వారకాధీష్ ఆలయం, కుసుమ సరోవర్, గోవర్ధన్ పర్వతం మరియు అనేక ఇతర దేవాలయాలు మ‌రెన్నో ఉన్నాయి. పురాత‌న ఆల‌యాల‌కు ఈ ప్రాంతం ప్ర‌సిద్ధిగాంచింది. చారిత్ర‌క క‌ట్ట‌డాలు, పురాత‌న ఆల‌యాల‌ను సంద‌ర్శించేంద‌కు ఈ ప్రాంతానికి ఏటా వేలాదిమంది భ‌క్తులు విదేశాల నుంచి ఇక్క‌డికి త‌ర‌లి వ‌స్తుంటారు.

ayodhya1

అయోధ్య

రామజన్మభూమిలో ఆలయ నిర్మాణం ప్రారంభించిన వెంటనే, అయోధ్యలో పర్యాటకుల సంఖ్య పెరగడం ప్రారంభమైంది. అయోధ్య శ్రీరాముని జన్మస్థలం మరియు మత విశ్వాసంతో ముడిపడి ఉన్న పవిత్ర ప్రదేశం. ఈ ప్రాంతంలో అనేక పురాత‌న దేవాలయాలను సందర్శించే అవకాశం మీకు లభిస్తుంది. రామ్ లల్లా టెంపుల్, హనుమాన్ గర్హి టెంపుల్, నాగేశ్వర్ నాథ్ టెంపుల్, రాజ్‌కోట్, కనక్ భవన్ టెంపుల్, త్రేతా కే ఠాకూర్, మోతీ మహల్ వంటి ఆల‌యాల‌ను చూడడానికి సుదూర ప్రాంతాల నుండి ప్రజలు ఇక్క‌డికి త‌ర‌లి వస్తుంటారు.

prayagraj1

ప్రయాగ్‌రాజ్

ప్రయాగ్‌రాజ్ ఉత్తర ప్రదేశ్‌లోని అతిపెద్ద నగరాలలో ఒకటి. ప్రపంచ ప్రసిద్ధ కుంభమేళా ప్రతి ప‌న్నెండు సంవత్సరాలకు ఒక‌సారి ఇక్కడ నిర్వహించబడుతుంది. ఇందులో విదేశాల నుండి వ‌చ్చే భ‌క్తులు కూడా ఇక్క‌డ పాల్గొంటారు. ఇక్కడ యమునా, గంగా, సరస్వతి ఈ మూడు నదులు కలుస్తాయి.

More News

    Read more about: agra varanasi mathura
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+