Search
  • Follow NativePlanet
Share
» »త‌క్కువ బ‌డ్జెట్‌లో హైదరాబాద్ టూ ఊటీ వెళ్లొద్దామా?

త‌క్కువ బ‌డ్జెట్‌లో హైదరాబాద్ టూ ఊటీ వెళ్లొద్దామా?

త‌క్కువ బ‌డ్జెట్‌లో హైదరాబాద్ టూ ఊటీ వెళ్లొద్దామా?

ఎండ‌లు మండిపోతున్నాయ్‌. ఇలాంటి స‌మయంలో ఎక్క‌డికైనా చ‌ల్ల‌ని ప్ర‌దేశానికి టూర్ వెళితే ఎలా ఉంటుంది. మ‌న‌సుకు హాయిగానే ఉంటుంది కానీ, మ‌రి బ‌డ్జెట్ సంగ‌తేంటి? ఆచాలామంది మ‌న‌సులో ఇదే ఆలోచ‌న వారి టూర్ ప్లాన్‌ను అడ్డుకుంటుంది. అయితే, అలాంటి వారి కోసం ఐఆర్‌సీటీసీ ఓ మంచి ప్యాకేజీని అందిస్తోంది. హైదరాబాద్ నుంచి ఊటీకి సూపర్ ప్యాకేజీని పరిచ‌యం చేస్తోంది. ఐఆర్‌సీటీసీ హైదరాబాద్ నుంచి తమిళనాడులోని పలు ప్రాంతాలను చూసేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ లో ఊటీ, కున్నూర్ వంటి పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. మ‌రెందుకు ఆల‌స్యం ఆ టూర్ ప్యాకేజీ విశేషాల‌ను తెలుసుకుందాం రండి!

స‌మ్మ‌ర్ టూర్‌. అందికూడా మొత్తం ఆరు రోజులు. ఐఆర్‌సీటీసీ ప్ర‌క‌టించిన ఈ 'ULTIMATE OOTY EX HYDERABAD (SHR094)లో మొత్తం ఐదు రాత్రులు, ఆరు రోజుల టూర్ ప్యాకేజీ ఆస్వాదించండి. ఈ జ‌ర్నీలో ఊటీతో పాటుగా కూనూర్‌లోని పర్యాటక ప్రాంతాలను చూడొచ్చు. ప్రస్తుతం ఈ టూర్ ఏప్రిల్ 4వ తేదీన అందుబాటులో ఉంది. దీని షెడ్యూల్‌ను ప‌రిశీలిస్తే..

vizag1

రూట్ మ్యాప్ ఇలా ఉంటుంది..

మొద‌టి రోజు ఊటీ టూర్ ప్యాకేజీ హైదరాబాద్‌లో ప్రారంభమవుతుంది. స‌రిగ్గా మధ్యాహ్నం 12.20 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ రైలు ఉంటుంది. ఈ ప్ర‌యాణంలో రాత్రి అంతా జర్నీ చేయాల్సి ఉంటుంది. అలా రెండో రోజు ఉదయం 8 గంటలకు కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటాం. అక్కడ నుంచి ప్ర‌త్యేక వాహ‌నంలో సిబ్బంది ఊటీకి తీసుకెళ్తారు. ముందుగానే కేటాయించిన‌ హోటల్‌లో చెకిన్ అవ్వాలి. తర్వాత అస‌లైన మ‌జా మొద‌ల‌వుతుంది. ముందుగా బొటానికల్ గార్డెన్స్, ఊటీ లేక్‌ను చూపిస్తారు. రాత్రి భోజనం చేశాక ఊటీలోనే బస చేయాల్సి ఉంటుంది. మూడో రోజు దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ సందర్శన ఉంటుంది. ఈ ప్ర‌దేశాలు మిమ్మ‌ల్ని మ‌రో స‌రికొత్త ప్ర‌పంచంలోకి తీసుకువెళ్లే అనుభూతిని అందిస్తాయి. మ‌ళ్లీ రాత్రికి ఊటీలోనే బస చేయాలి.

ooty1 falls

స‌మ‌యం తెలియ‌కుండానే..

నాలుగో రోజు కూనూర్ సైట్ సీయింగ్ ఉంటుంది. ప్ర‌కృతితో మ‌మేక‌య్యే క్ష‌ణాల‌ను ఆస్వాదించాలి అనుకునేవారికి ఈ రోజు చాలా ముఖ్య‌మైన‌దిగా చెప్పొచ్చు. ఆ రోజు మొత్తం మ‌న‌కు తెలియ‌కుండానే గ‌డిచిపోతుందంటే న‌మ్మండి. అక్క‌డి అందాలు అంతా మ‌నల్ని మైమ‌రిపింప‌చేస్తాయి. రాత్రికి ఊటీలోనే భోజనం చేసి బస చేయాలి. ఐదో రోజు ఉదయం హోటల్ నుంచి చెక్ అవుట్ చేయాలి. అక్కడ నుంచి కొయంబత్తూర్ రైల్వే స్టేషన్‌కు పర్యాటకులను తీసుకెళ్తతారు. మధ్యాహ్నం 4.35 గంటలకు శబరి ఎక్స్‌ప్రెస్ ఉంటుంది. రాత్రి మెుత్తం జర్నీ చేయాలి. చివ‌రి రోజైన ఆరో రోజు మధ్యాహ్నం 12.20 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటాం. దీంతో టూర్ ముగుస్తుంది.

ooty plant

ప్యాకేజీ ధరల ఇలా ఉన్నాయి..

ఈ టూర్ ప్యాకేజీ అంద‌రికీ అందుబాటులో ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. ఒక్క‌సారి ఊటీ టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ ప్యాకేజీ ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.11,870, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,220గా ఉంది. అదే, కంఫర్ట్ ప్యాకేజీ ధరలో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.14,330, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.17,670, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.31,410గా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు వేర్వురు ధరలు ఉన్నాయి. మ‌రిన్ని వివ‌రాల‌కు ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ చూస్తే స‌రిపోతుంది.

More News

    Read more about: irctc hyderabad tamil nadu
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+