ఇండియాలోని ది బెస్ట్ హానీమూన్ ప్రదేశాలివే..
పెళ్లిళ్ల సీజన్ మొదలైంది. ఈరోజుల్లో పెళ్లి తేదీ ఫిక్స్ అయిన వెంటనే మిగతా పనులకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, కొత్త జంటల హనీమూన్ ప్లాన్ కూడా అంతే కీలకంగా మారింది. వీరి ప్లానింగ్ నెల రోజుల ముందే మొదలవుతుంది. కాబట్టి మీరు మీ హనీమూన్ ట్రిప్‌ని ఇంకా ప్లాన్ చేసుకోకుంటే, ఇంకా సమయం వృధా చేసే అవకాశం ఉండదు. ఈ రోజు మనం భారతదేశంలోని అటువంటి అందమైన ప్రదేశాల గురించి చర్చిస్తున్నాం. ఇవి వేసవిలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశాలు. ఈ ప్రాంతాల్లో మీ భాగస్వామితో కలిసి సంతోషంగా గడిపేందుకు ఈ ప్రదేశాలు ఎంతో అనువైనవనే చెప్పుకోవచ్చు.

ఔలి, ఉత్తరాఖండ్
ఔలి భారతదేశంలోని ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వతాలలో చమోలి జిల్లాలో ఉంది. ఔలి, ఔలి బుగ్యాల్ అని కూడా పిలుస్తారు. గర్హ్వాలిలో గడ్డి మైదానం అని దీని అర్థం. ఇది సముద్రమట్టానికి 2,800 మీటర్ల ఎత్తులో ఉంది. ఈ ప్రాంతం అత్యధిక సంఖ్యలో పుష్పజాతులను కలిగి ఉంది. 520 జాతుల ఎత్తయిన మొక్కలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతం మే-జూన్‌లో మండే వేడిలో సందర్శించడానికి ఉత్తమమైన ప్రదేశం. వేసవిలో ఈ ప్రదేశం అందం మరింత పెరుగుతుంది. మీ భాగస్వామితో కలిసి ఈ ప్రాంతాన్నిసందర్శించడం మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళుతుంది. ఈ ప్రదేశంలో స్కీయింగ్, ట్రెక్కింగ్, క్యాంపింగ్, నేచర్ వాక్‌లు వంటి కార్యకలాపాలను ఆస్వాదించవచ్చు.

లడఖ్
లడఖ్, భారతదేశంలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. ఇది హిమాలయశిఖరాల మధ్య ఉన్న పీఠభూమి. బౌద్ధమతస్తులు ఎక్కువగా ఉన్నందున దీనిని చిన్నటిబెట్ అంటారు. లేహ్ ఇక్కడి ప్రధాన పట్టణం. లడఖ్‌లో బౌద్ధమతస్తులు ఎక్కువమంది విస్తరించి ఉన్నారు. ఈ ప్రదేశం హనీమూన్ జంటలు విహరించేందుకు అద్భుతమైన ప్రదేశం. రంగు మారే లోయలు, సరస్సులు, పర్వతాలు, బౌద్ధ విహారాల అందాలు ఈ ప్రాంతంలో తప్పా బహుశా మరెక్కడా కనిపించవు. మే మరియు జూన్ నెలలు ఇక్కడ సందర్శించడానికి ఉత్తమమైనవి.

గుల్మార్గ్, జమ్మూ మరియు కాశ్మీర్
ఎత్తయిన మంచుతో కప్పబడిన పర్వతాలు, పచ్చదనం, చిన్నసరస్సులు మరియు అనేక రకాల పూలతో అలకరించబడి ఉంటుంది జమ్మూకాశ్మీర్‌లోని గుల్మార్గ్. ఈ ప్రాంతంలో అత్యంత ప్రజాదరణ పొందిన సాహస కార్యకలాపం స్కీయింగ్. హనీమూన్ గమ్యస్థానాల జాబితాలో కాశ్మీర్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. ఇక్కడి గుల్మార్గ్ చాలా రొమాంటిక్ ప్రదేశం. అందమైన లోయలు, పచ్చని తోటలు, తేలియాడే రిసార్ట్‌లలో మీ భాగస్వామితో గడిపే ఈ క్షణాలు మరువలేనివి.

కూర్గ్
మడికేరి లేదా కూర్గ్ స్కాట్లాండ్ ఆఫ్ ఇండియా గా ప్రసిద్ధి చెందింది. ఇది దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలో ఉన్న అత్యంత అందమైన హిల్‌స్టేషన్ పట్టణాలలో ఒకటి. సుందరమైన హిల్‌స్టేషన్ సముద్రమట్టానికి సుమారు వెయ్యి మీటర్ల ఎత్తులో ఉంది. ఇది ప్రపంచ స్థాయి కాఫీ మరియు జాతి యోధులైన కొడవస్ తెగలకు ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం వేలాడే లోయలు, లోతైన కనుమలు మరియు ఏటవాలు కొండలు మరియు విస్తారమైన వృక్షసంపదను కలిగి ఉంటుంది. అనేక వినోద కార్యాకలపాలతో పాటు ఈ ప్రాంతంలో హైకింగ్, క్యాపింగ్, ట్రెక్కింగ్ మరియు రివర్‌రాఫ్టింగ్ వంటి వాటిని కూడా ఆస్వాదించొచ్చు. పచ్చదనం మధ్యలో విశ్రాంతి తీసుకునేందుకు మీరు ఈ ప్రాంతాన్ని తప్పక సందర్శించాలి. కూర్గ్ ప్రకృతి ప్రేమికులకు స్వర్గధామం. ఈ ప్రదేశం సహజసౌందర్యం మరియు పొగమంచు ప్రకృతి దృశ్యాలతో పర్యాటకులను కనువిందు చేస్తుంది. అందుకే ఈ ప్రాంతం హానీమూన్ జంటలకు ఎంతో ఉత్తమం.



Click it and Unblock the Notifications
















