Search
  • Follow NativePlanet
Share
» »వ‌ర్ష‌కాల ప్రారంభంలో ఈ ప్రాంతాల‌ను చుట్టేయండి..

వ‌ర్ష‌కాల ప్రారంభంలో ఈ ప్రాంతాల‌ను చుట్టేయండి..

ఢిల్లీ-ఎన్‌సిఆర్‌తో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో ఈసారి ఎండ‌లు మండిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వర్షాకాలం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రుతుపవనాల రాకతో, మండుతున్న ఎండ మరియు వేడి నుండి ఉపశమనం పొందాల‌ని చూస్తున్నారు. అంతేకాకుండా ఈ రాబోయే వ‌ర్ష‌కాలంలో ప్ర‌కృతి యొక్క అందమైన దృశ్యాలు చూడాల‌ని కూడా చాలామంది ఎదురుచూస్తున్నారు. మ‌రెందుకాల‌స్యం వ‌ర్షాకాల ప్రారంభంలో ఈ ప్రాంతాల‌ను చుట్టేయండి. ప్ర‌శాంత‌మైన వాతావ‌ర‌ణం ఈ ప్ర‌దేశాల్లో ఉంటుంది. వర్షంలో తడుస్తూ విహారయాత్రకు వెళ్లేందుకు ఇష్టపడే వ్యక్తుల్లో మీరు కూడా ఒకరయితే మాత్రం ఖచ్చితంగా ఈ స్థలాలను మీ విహారాయాత్ర జాబితాలో చేర్చండి.

goa2

గోవా

గోవా కేవ‌లం బీచ్‌లకు ప్రసిద్ధి చెందడ‌మే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజల ఇష్టమైన పర్యాటక ప్రదేశంగా కూడా అభివృద్ధి చెందింది. ఏడాదిలో ఏ నెలలోనైనా ఇక్కడికి వెళ్లవచ్చుగానీ, వర్షాకాలంలో ఇక్కడికి రావడం వల్ల వచ్చే మజా రెట్టింపు అవుతుంది. గోవా లేదా గోమాంటక్ అని ఈ ప్రాంతాన్నిపిలుస్తారు. ఈ ప్రాంతానికి మహాభారతంలోనూ, ఇతర ప్రాచీన గ్రంథాలలోనూ గోపరాష్ట్రం, గోవరాష్ట్రం, గోపకపురి, గోపక పట్టణం, గోమంచాల, గోవపురి వంటి పేర్లు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా వర్షాకాలంలో స్నేహితులు లేదా భాగస్వామితో ఆనందించాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా గోవాకు వెళ్లండి.

shillong1

షిల్లాంగ్

షిల్లాంగ్ దేశంలోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ప్రసిద్ధ హిల్ స్టేషన్. చాలా మంది వర్షాకాలంలో విహార‌యాత్ర‌ల‌కు వెళ్ల‌డానికి ఇష్ట‌ప‌డ‌తారు. షిల్లాంగ్ ఈశాన్యభారతదేశంలోని మేఘాలయ రాష్ట్ర రాజధాని నగరం. ఇది ఒక పర్వతప్రాంత పట్టణం. తక్కువ ఎత్తులో ఉన్న కొండల వరుసపై విస్తరించి ఉన్నఈ పట్టణాన్ని చూస్తే యూరోపియన్లు స్థిరపడిన స్కాట్లాండ్ ప్రాంతం గుర్తుకు వస్తుంది కాబట్టి ఈ ప్రదేశాన్ని స్కాట్లాండ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తారు. ఈ సీజన్‌లో మీరు ఇక్కడ పచ్చదనం మరియు జయంతి కొండల విశాల దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.

lonavala1

లోనావాలా

మహారాష్ట్రలో ఉన్న లోనావాలా వర్షాకాలంలో సందర్శించడానికి సరైన ప్రదేశం. ఇది రాష్ట్రంలోని ప్రసిద్ధ హిల్ స్టేషన్. ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శనకు వ‌స్తారు. వర్షాకాలంలో ఇక్కడి పచ్చదనం ప‌ర్యాట‌కుల‌ను ఎంత‌గానో ఆకర్షిస్తుంది. లోనావాల అనేది ప‌శ్చిమ భార‌త‌దేశంలోని ప‌చ్చ‌ని లోయ‌ల‌తో కూడిన ఒక హిల్‌స్టేష‌న్‌. దీనిని గుహ‌ల న‌గ‌రం అని కూడా పిలుస్తారు. ఇది హార్డ్ స్వీట్స్ చిక్కి త‌యారికీ అద‌నంగా ప్ర‌సిద్ధి చెందింది.

కూర్గ్

భారతదేశంలోనే అత్యంత ఆకట్టుకునే హిల్ స్టేషన్లను కలిగిన ప్రాంతం కూర్గ్. ఇది భారతదేశ స్కాట్లాండ్ గా ప్రసిద్ధి చెందింది. కూర్గ్ గా పిలువబడే కొడగు ప్రాంతం ఇది. దక్షిణ కర్ణాటకలోని చాలా సుందరమైన, ఆకర్షణీయమైన పర్వత ప్రాంతం ఇది. ఉత్కంఠభరితమైన దృశ్యాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడి పచ్చని వాతావరణం, కాఫీ తోటలు పర్యాటకులకు స్వర్గానుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రాంతం పర్యాటక ప్రియులను ఆకట్టుకునేలా ఉంటుంది. అందమైన వర్షాకాలంలో ప్రశాంతతను ఇచ్చే ప్రదేశంలో సెలవులు గడపాలనుకుంటే మాత్రం కర్ణాటకలోని కూర్గ్‌కు వెళ్లవచ్చు.

valleyofflowers

పూల లోయ

ఉత్తరాఖండ్ భారతదేశంలోని అటువంటి రాష్ట్రం, ఇక్కడ ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు దేశ‌విదేశాల నుండి త‌ర‌లివ‌స్తుంటారు. ప్రకృతి రమణీయతతో నిండిన ఈ రాష్ట్రం ప్రజలలో ఎప్పుడూ సెంటరాఫ్ అట్రాక్షన్‌గా ఉంటుంది. వర్షాకాలంలో కూడా ఇక్కడ అనేక అందమైన దృశ్యాలు కనిపిస్తాయి. వర్షంలో ఎక్కడైనా సందర్శించాలని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఉత్తరాఖండ్‌లోని పూల లోయకు వెళ్లొచ్చు. ఇది యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంలో కూడా భాగమైంది.

More News

    Read more about: goa shillong
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+