ఉదయపూర్ 17 వ శతాబ్దంలో నిర్మించిన బడా మహల్ సిటీ పాలెస్ లో పురుషుల విభాగం. బడా మహల్ అంటే, పెద్ద భవంతి అని అర్ధం. దీనిని 90 అడుగుల ఎత్తున ఉన్న సహజ౦గా ఏర్పడిన శిల మీద చుట్టూ పచ్చటి పచ్చిక బయళ్ళతో, అద్భుతమైన ఉద్యానవనాలతో, అందమైన పైకప్పు లతో, స్తంభాలతో, బాల్కనీలు, ఫౌంటైన్ లతో నిర్మించారు. ఈ భవంతి లోని గదులలో అద్దాలు, శిల్పాలూ, చిత్రాలూ ఉన్నాయి.



Click it and Unblock the Notifications