Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఉదయపూర్ » ఆకర్షణలు » ఏక్ లింగ్ జీ దేవాలయం

ఏక్ లింగ్ జీ దేవాలయం, ఉదయపూర్

1

ఉదయపూర్ లోని ఏక్ లింగ్ జీ దేవాలయం ప్రధాన నగరం నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏక్ లింగ్ జీ దేవాలయం ఉదయపూర్ లోని అత్యంత ప్రసిద్దిచెందిన, పురాతన ధార్మిక కేంద్రాలలో ఒకటి. ఈ ఆలయంలో శివుని విగ్రహం ఉంది, ఇది క్రీ. శ. 734 లో ఆచార్య విశ్వరూప చే నిర్మించబడిందని నమ్ముతారు.

2500 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఈ ఆలయ ప్రాంగణంలో 108 దేవాలయాలు ఉన్నాయి. 50 అడుగుల ఎత్తు ఉండి, నాలుగు ముఖాలు కలిగిన శివుని నల్లరాయి విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. నాలుగు ముఖాలు కలిగిన మహాదేవ చౌముఖి లేదా శివుని విగ్రహం నాలుగు దిక్కుల నుండి చూడవచ్చు. అవి విష్ణు(ఉత్తరం), సూర్య(తూర్పు), రుద్ర(దక్షిణం), బ్రహ్మ(పడమర) సూచిస్తాయి. శివుని వాహనమైన అందమైన నంది విగ్రహం ఆలయ ప్రధాన ద్వారం వద్ద ఉంది. ఈ ఆలయంలో భక్తులు సపరివారంగా ఉన్న శివుని చిత్రాలు చూడవచ్చు.

ఈ ఆలయం లోపల శివుని భార్య పార్వతి, కొడుకు వినాయకుడిని చూడవచ్చు. యమునా, సరస్వతి దేవతలా విగ్రహాలు ఈ ఆలయంలో పొందుపరచబడ్డాయి. ఈ చిత్రాల మధ్యలో, చుట్టూ వెండి పాముతో ఒక శివలింగం ఉంది. ఆలయంలోని వెండి తలుపులపై వినాయక, షణ్ముఖ చిత్రాలు ఉన్నాయి. నర్తించే అప్సరసల విగ్రహాలు కూడా ఇక్కడ చూడవచ్చు. వినాయకుడి ఆలయం, అంబా మాత ఆలయం, నాథోం కా మందిర్, కాళికా ఆలయం ఈ దేవాలయానికి దగ్గరగా ఉన్నాయి.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Sep,Fri
Return On
19 Sep,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Sep,Fri
Check Out
19 Sep,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Sep,Fri
Return On
19 Sep,Sat