ఉదయపూర్ లోని ఫతే సాగర్1678 లో మహారాణా ఫతే సింగ్ కోడిగుడ్డు ఆకారంలో నిర్మించిన అందమైన కృత్రిమ సరస్సు ఫతే సాగర్. ఉదయపూర్ లోని నాలుగు చెరువులలో ఒకటైన ఫతే సాగర్ ను నగరానికి గర్వకారణంగా భావిస్తారు. నీలి రంగులో ఉండే నీళ్ళు, పచ్చటి పరిసరాలూ ఈ ప్రదేశానికి రెండో కాశ్మీర్ అనే పేరు తెచ్చి పెట్టాయి.
ఈ చెరువు మధ్యలో మూడు చిన్న ద్వీపాలు ఉన్నాయి. విక్టోరియా మహారాణి కుమారుడు డ్యూక్ ఆఫ్ కన్నాట్ ఈ చెరువుకి శంకుస్థాపన చేసాడు. ఇది ఒక చిన్న కాలవ ద్వారా పిచోలా సరస్సుకి, ర౦గ్ సాగర్ సరస్సుకి అనుసంధానించబడి ఉంది. ఫతే సాగర్ ఒడ్డున రామ్ ప్రతాప్ భవంతి ఉంది. స్థానిక బస్సులు, టాక్సీలు, ఆటోలు, టాంగాల ద్వారా పర్యాటకులు ఇక్కడికి చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications