డేరా బాబా రుద్రు పర్యాటక ప్రదేశం, నారి గ్రామం లో కలదు. యూనా కు 10 కి. మీ.ల దూరంలో కల ఈ క్షేత్రం బాబా రుద్రానంద్ కు చెందినది. బాబా రుద్రానంద్, శివుడు అవతారం గా భావిస్తారు. 1850 లో ఇక్కడ ఉంచబడిన అఖండ దూన అనే యజ్ఞం లోని భస్మాన్ని చాల పవిత్రంగా భావిస్తారు. ఈ భస్మం, పాము కాటుకు విరుగుడుగా కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుత గురువు అయిన మహంత్ సుగ్రీవానంద్ బాబా, రుద్రు బాల గోపాల్ దేవాలయాన్ని ఢిల్లీ లో 1970 లలో నిర్మించారు. పంచ భీష్మ మేలా, నిర్జల ఏకాదశి, బాబా రుద్రు జయంతి, గురు పూర్ణిమ వంటివి అట్టహాసంగా ఇక్కడ జరుపుతారు. హిందువుల పండుగ సంక్రాంతి సమయం లో కుశోక్ పతిని అమావాస్య సంబధిత క్రతువులను ఆచరిస్తారు.



Click it and Unblock the Notifications