వాగమాన్ లో ఈ సూయిసైడ్ పాయింట్ బాగా ప్రసిద్ధి చెందినది. దీనిని మూన్ పారా అంటారు. ఈ గుట్ట ఒక వి- ఆకారంలో ఉండి చాలా అందంగా ఉంటుంది. ఈ ప్రదేశం నుండి కింద వ్యాలీ లోకి లోతుగా చూడవచ్చు. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. వ్యాలీ లోతు అగాధంలా ఉంటుంది.
సూయిసైడ్ పాయింట్ కు ట్రెక్కింగ్ కష్టమే కానీ ఒక సారి పైకి చేరితే, చాలా హాయిగా భావిస్తారు. అక్కడి సుందరమైన ప్రదేశాలు, చల్లని గాలులు పర్యాటకులను మైమరపిస్తాయి. మీరు పడిన శ్రమను తేలికగా మరచిపోతారు.



Click it and Unblock the Notifications