యల్లాపూర్ సందర్శించే పర్యాటకులు సుమారు 20 కి.మీ.ల దూరంలోగల జేనుకల్లుగుడ్డ సూర్యాస్తమయ ప్రదేశాన్ని తప్పక చూడాలి. 450 మీటర్ల పడమటి కనుమలలో ఉన్న ఈ ప్రదేశం పర్యాటకులకు అందమైన సూర్యాస్తమయ దృశ్యాన్ని చూపుతుంది. అందమైన కొండచరియలు ఒకదాని వెనుక మరొకటి బహు సుందరంగా ఉంటాయి.
జేనుకల్లుగుడ్డ చేరిన పర్యాటకులు బెడ్తి నది అరేబియా సముద్రంలో కలవటాన్ని కూడా చూడవచ్చు. బలేకల్లుగుడ్డ మరియు కొడేకల్లుగుడ్డ లు కూడా జేనుకల్లుగుడ్డ సమీపంలోగల అందమైన కొండలు. ‘జేను’ అంటే కన్నడం భాషలో తేనె, ‘కల్లు’ అంటే ‘రాయి’ అని, మరియు ‘గుడ్డ’ అంటే ‘కొండ’ అని అర్ధాలుగా చెపుతారు.



Click it and Unblock the Notifications