Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఆగ్రా » ఆకర్షణలు » గురు కా తల్

గురు కా తల్, ఆగ్రా

2

గురు కా తల్ ఆగ్రా లోని ఒక చారిత్రిక సిక్కు గురుద్వారా. ఇది ఆగ్రా శివార్లలో సికంద్రా, బలుచ్పుర రైలు స్టేషన్ దగ్గరగా ఉంది. ప్రాధమికంగా బాబా సాధు సింగ్ జి మౌని సన్యాసి మార్గదర్శక నాయకత్వంలో ప్రధానంగా సిక్కు సమాజం ప్రత్యేక ప్రయత్నాలు, సహకారంతో 1970 లో దీనిని నిర్మించారు.

ఈ మందిరాన్ని సిక్కుల తొమ్మిదవ గురువు గురు తేజ్ బహదూర్ జి కి శ్రద్ధాంజలి ఘటించేందుకు నిర్మించారు. దీనిలో ఒక చెరువు, తన ఆయుధాలను వదిలిపెట్టి, ఖైదు చేయడానికి గొప్ప సిక్కు గురువు తనను తాను మొఘల్ చక్రవర్తి బలగాలకు అప్పగించిన స్థలంగా చారిత్రిక ప్రాముఖ్యత కల్గిన ఒక జలాశయం ఉన్నాయి.

నిజానికి ఈ చెరువులో పన్నెండు స్తంభాలు ఉన్నాయి, కాలగమన నియంతృత్వానికి కేవలం ఎనిమిది మాత్రమే మిగిలాయి. దీనిని రాతి చెక్కడాలతో అలంకరించారు. ఎరుపు రాయితో మొఘలుల నిర్మాణ శైలిలో కట్టిన ఈ గురుద్వారా ముఖద్వారం ఆగ్రా కోటని, ఫతేపూర్ సిక్రిని పోలి ఉంటుంది. అన్ని మతాలకు చెందిన వేలాదిమంది భక్తులు కేవలం నగరం నుండే కాక, సుదూర ప్రాంతాల నుండి కూడా ప్రతి ఏటా ఈ గురుద్వారాను సందర్శిస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
18 Aug,Tue
Check Out
19 Aug,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
18 Aug,Tue
Return On
19 Aug,Wed