1648 లో మొఘల్ చక్రవర్తి షాజహాన్ తన ప్రియమైన కుమార్తె జహానారా బేగం కి శ్రద్ధాంజలి ఘటిస్తూ కట్టించిన జామా మసీదు, జామి మసీదు లేదా శుక్రవారం మసీదుగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందింది.
దీనిని ఎరుపు ఇసుక రాయితో నిర్మించి, సరళమైన ఆకృతిలో తెలుపు పాలరాయితో అలంకరించారు. ఈ మందిరం గోడలు, పై కప్పు పై నీలిరంగును పూసారు. ఆగ్రా రైలు స్టేషన్ కు ఎదురుగా నగరం మధ్యలో ఉన్న ఇది భారతదేశంలోని అతి పెద్ద మసీదులలో ఒకటి.
ఒక పెద్ద వేదిక పై ఉన్న ఈ మసీదులోనికి ఐదు వంపు ద్వారాల గుండా రావచ్చు. దీనికి ఎరుపు ఇసుకరాతిలో నిర్మించిన మూడు పెద్ద గుమ్మటాలు ఉన్నాయి. ఈ మందిరం గోడలను క్షేత్రగణిత బొమ్మలతో అలంకరించి, రంగు పలకలు, నగీషీ వ్రాత చెక్కుడులతో పొదిగారు.
జామా మసీదు కేంద్ర ప్రాంగణం చాల పెద్దది, విశాలమైన౦దున ఒకేసారి 1000 మంది భక్తులు ప్రార్ధనలలో పాల్గొనవచ్చు. దీని ప్రాంగణంలో గొప్ప సూఫీ సన్యాసి షేక్ సలీం చిష్టి సమాధి కూడా ఉంది.



Click it and Unblock the Notifications