Search
  • Follow NativePlanet
Share

ఆల్చి - ప్రకృతి గీసిన చిత్రం ...!

19

లేహ్ జిల్లాలో గల "ఆల్చి" గ్రామం సుప్రసిద్ధమైనది. ఇండస్ నది ఒడ్డున "లేహ్" జిల్లాకి 60 కి.మీ. దూరంలో గల ఈ గ్రామం హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో ఉంది.

ఈ గ్రామం లో "ఆల్చి" అనే పేరుతోనే ఒక పురాతన మఠం ఉంది.ఈ మఠం లడఖ్ లో గల అనేక యాత్రా స్థలాలలో ఒకటి. లడఖ్ లో గల ఇతర మఠాలు పర్వశ్రేణుల మీద ఉంటే, ఈ "ఆల్చీ" మఠం మాత్రం పర్వత పాద ప్రాంతం లో ఉంది.ఈ మఠ చరిత్ర 11వ శతాబ్ద కాలానికి సంబంధించినది. అసమాన శిల్పకళా నైపుణ్యానికి ఈ మఠం ప్రసిద్ధి. మఠ భవన సముదాయం లో "దు-ఖాంగ్","సం-త్సెక్","మంజుశ్రీ" ఆలయాలున్నాయి.బుద్ధుడు మరియు ఇతర దేవతల కి సంబంధించిన అనేక చిత్రాలు గోడల మీద చిత్రీకరించబడి కలవు.

ప్రక్రుతి మధ్యలో సేద తీరినట్లుండే "ఆల్చి" ప్రక్రుతి గీసిన చిత్రం లా ఉంటుంది. మఠ ఆచార వ్యవహారలని ఇక్కడికొచ్చే యాత్రికులు శ్రద్ధగా గమనించవచ్చు. ఈ గ్రామంలో రాత్రి పూట బస చెయ్యటానికి వీలుగా కొన్ని వసతులు ఉన్నాయి.భారత దేశ ప్రసిద్ధ నగరాలతో ఈ గ్రామం విమానయానం ద్వారా అనుసంధానించబడింది."లేహ్" విమానాశ్రయం "ఆల్చి" కి అతి దగ్గరలో ఉంది."లేహ్" నగరం "పూనా","ఢిల్లీ","జమ్ము","శ్రీ నగర్" తదితర నగరాలతో అనుసంధానించబడటం వల్ల ఆయా నగరాల నుండి "ఆల్చీ" చేరుకోవటం తేలిక."ఆల్చి" కి దగ్గరలో గల రైల్వే స్టేషన్ లు పఠాన్ కోట్ మరియు చండీఘర్.

"ఆల్చి" గ్రామం లో వాతావరణ పరిస్థితులు పర్యటనకు అంత అనుకూలం గా ఉండవు. ఇక్కడ చలికాలం లో గడ్డ కట్టే చలి ఉంటుంది. కానీ వేసవి ఆహ్లాదంగా ఉంటుంది. ఇక్కడ సంవత్సరం పొడుగునా వర్షపాతం నమోదవుతుంది. వేసవిలో రాత్రి ఉష్ణొగ్రతలు బాగా పడిపోతాయి. ఆల్చి దర్శించటానికి అనువైన కాలం..జూన్-సెప్టెంబర్ ల మధ్య కాలం.

ఆల్చి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

ఆల్చి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం ఆల్చి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? ఆల్చి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం మనాలి,శ్రీనగర్ నుండి ఆల్చీ గ్రామానికి బస్సులు తరచుగా ఉన్నాయి. యాత్రికులు తమ బడ్జెట్ అనుసరించి "డీలక్స్" లేదా "ఆర్డినరీ" బస్సులని ఎంచుకోవచ్చు. ఎంచుకున్న బస్సులని బట్టి బస్సు చార్జీ 100 రూపాయలనుండీ 2000 రూపాయల వరకూ ఉంటుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం:చండీఘర్,పఠాన్ కోట్ రైల్వే స్టేషన్లు ఆల్చి కి దగ్గరలో ఉన్నాయి. లేహ్,పఠాన్ కోట్ ల మధ్య దూరం 776 కిలో మీటర్లు.ఈ రెండు స్టేషన్ ల మధ్య రైళ్ళు తరచు గా నడుస్తాయి.పఠాన్ కోట్ స్టేషన్ భారత దేశం లో గల ఇతర నగరాలు,పట్టణాలతో అనుసంధానించబడింది. రైలు ద్వారా పఠాన్ కోట్ చేరుకున్న యాత్రికులు ట్యాక్సీ లు అద్దెకి తీసుకుని ఆల్చీ చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    లేహ్ కి 70 కిలో మీటర్ల దూరం లో గల ఆల్చీ గ్రామాన్ని,రోడ్డు,రైలు,విమాన మార్గాల ద్వారా చేరుకోవచ్చు. విమాన మార్గం లేహ్,ఆల్చీ గ్రామనికి దగ్గర లో గల విమానాశ్రయం. ఈ విమానాశ్రయం భారత దేశ ప్రసిద్ధ నగరాలైన "పూణే","ఢిల్లీ","జమ్ము","శ్రీనగర్" లకి అనుసంధానించబడింది. ఢిల్లీ లో గల ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి "లేహ్" కి విమానాలు తరచుగా ఉండటం వల్ల "ఆల్చీ" గ్రామాన్ని సందర్శిచ్ణే విదేశీ యాత్రికులకి శౌలభ్యం గా ఉంటుంది. విమాన మార్గం ద్వారా "లేహ్" చేరుకున్న యాత్రికులు ట్యాక్సీ ల ద్వారా "ఆల్చీ" ని చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed