అంబోలి పట్టణంలోని మాధవ్ ఘడ్ కోట అద్భుతమైన చారిత్రక ప్రాధాన్యత కలిగి ఉంది. ప్రస్తుతం ఇది శిధిలావస్ధలో ఉంది. ఇది పూనే లోని కోటకు సుమారు నాలుగు రెట్లు పెద్దదిగా ఉంటుంది. ఇది శనివార్ వాడ పేరుతో ప్రసిద్ధి గాంచింది. ఈ కోట మెయిన్ రోడ్ పైనే కలదు. కోటపై నుండి చూస్తే ఎంతో అద్భుతంగా చుట్టుపక్కల ప్రాంతాలు కనపడతాయి. అరేబియా సముద్రం, కొంకణ్ తీరం సుందరంగా కనపడతాయి. చుట్టు పక్కల కల దట్టమైన అడవులు అందంగా ఆనందం కలిగించేవిగా ఉంటాయి. సమీపంలోనే ఒక శివాలయం కలదు. దీనిని ఒక శివ భక్తుడు నిర్మించినట్లు చెపుతారు.



Click it and Unblock the Notifications