Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» అమరావతి

అమరావతి - మహాత్ముల జన్మస్ధలం

9

ఇప్పుడిపుడే పారిశ్రామికంగా అభివృధ్ధి చెందుతున్న పట్టణం అమరావతి. మహారాష్ట్రలోఈ పట్టణం మన దేశ సంస్కృతిలోను, సాహిత్యంలోను  ఒక ప్రత్యేక స్ధానాన్ని కలిగి ఉంది. ఈ పట్టణంలో జన్మించిన వారిలో గోపాల్ నీలకంఠ దండేకర్ మరియు సురేష్ భట్ వంటి ప్రఖ్యాత వ్యక్తులు ఎందరో కలరు.

విప్లవకారుడు భగత్ సింగ్ తాను కొంతకాలంపాటు కనుమరుగైన సమయంలో అమరావతిలో మూడు రోజులపాటు తలదాచుకున్నాడు. అమరావతి అనేకమంది రుషులకు, సాంఘిక సంస్కర్తలకు, రాజకీయ నాయకులకు, కళాకారులకు, స్వాతంత్ర పోరాట యోధులకు కూడా జన్మనిచ్చింది.  అమరావతి - మతాలకు పుట్టినిల్లుఆధ్యాత్మిక వేత్తలు అమరావతి దేవతల రాజు ఇంద్రుడి పట్టణంగా చెపుతారు. హిందూ పురాణాల మేరకు శ్రీ క్రిష్ణుడు మాత రుక్మిణీ దేవిని ఇక్కడే కల ప్రఖ్యాత అంబాదేవి దేవాలయంనుండి తీసుకెళ్ళి ఆమెను కాపాడాడని చెపుతారు. విదర్భ ప్రాంతంలో ఉన్న అంబాదేవి దేవాలయం భారతీయ ఆధ్యాత్మిక శిల్ప సంపదల వైభవాన్ని ఎత్తి చూపుతుంది. రుక్మిణితో కలసి శ్రీ క్రిష్ణుడు పారిపోయిన సొరంగ మార్గాన్ని అనేకమంది రీసెర్చి బృందాలు ఎంతో పరిశోధించాయి. కాని ఆ సొరంగా మార్గ పొడవును ధృవీకరించలేకపోయాయి.

అమరావతిలో ప్రసిద్ధి చెందిన దేవాలయాలను తప్పకుండా చూడాలి. అవి బాలక్రిష్ణ దేవాలయం, సోమేశ్వర దేవాలయం, మురళీధర దేవాలయం మరియు బ్రహ్మచారి మహారాజ్ దేవాలయం మొదలైనవి.

అమరావతిలో చేసే పండుగ వేడుకలు కూడా అద్భుతంగా ఉంటాయి. వాటిలో నవరాత్రి, దీపావళి, హోళి మొదలైనవి ప్రసిద్ధి. నవరాత్రి మహోత్సవాలను ఎంతో అట్టహాసంగా జరుపుతారు. సాయినగర్ లోని సాయి భక్తిధాం దేవాలయం, రాహత్ గాంవ్ లోని శ్రీ స్వామి సమర్ధ దేవాలయాలను భక్తులైన పర్యాటకులు వేల సంఖ్యలో  ఏటా దర్శించి తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు. శ్రీ క్రిష్ణుడు రుక్మిణి దేవిని ఎత్తుకెళ్ళినట్లుగా  పైన తెలుపబడిన ప్రాచీన అంబాదేవి దేవాలయంను వేలాది భక్తులు సందర్శిస్తారు.

వన్యజీవులు పట్ల ఆసక్తికలవారికి చిక్కలధార వైల్డ్ లైఫ్ శాంక్చురీ మరియు గుగర్నాల్ నేషనల్ పార్క్ లు అనేక జంతువులను ప్రదర్శిస్తాయి. ఇక్కడ కల మేల్ఘాట్ టైగర్ రిజర్వు,  పర్యాటకులు తప్పక చూడాలి.  ఈ ప్రాంతం  సుమారు 40 రకాల వివిధ క్షీరజాలకు, 250 విభిన్న జాతుల పక్షులకు మరియు 150 జాతుల సరీనృపాలకు నిలయంగా ఉంటుంది.

అమరావతికి అర్ధం చెప్పాలంటే, దేవతల పట్టణం అని చెప్పాలి. ఈ పట్టణం మహారాష్ట్ర ఉత్తర సరిహద్దులో మధ్య భాగంలో కలదు. దక్కన్ పీఠభూమిలో కల ఈ పట్టణం తాపి బేసిన్ లో కలదు. కొన్ని భాగాలు తూర్పున కల వార్ధా వ్యాలీలో ఉన్నాయి. సుమారు 12,626 చ. కి.మీ.లు విస్తీర్ణంలో కల ఈ భూ భాగం మహారాష్ట్రలో అధిక జనాభాకల ఏడవ పట్టణంగా పేరు పడింది. అమరావతి నాగపూర్ పట్టణానికి 156 కి.మీ. ల దూరంలో సుమారు 343 మీటర్ల ఎత్తున కలదు. అమరావతికి దానిపేరు ‘ఉదుంబ్రావతి’ నుండి వచ్చింది. ఈ ప్రాంతంలో ఉదుంబర చెట్లు అధికంగా ఉండటంచే దీనికి ఉదుంబ్రావతి అని పేరు పెట్టారు.

మరి కొంతమంది అభిప్రాయాల మేరకు అమరావతికి ప్రాచీన అంబాదేవి దేవాలయం కారణంగా అమరావతి అనే పేరు వచ్చిందని కూడా చెపుతారు. ఆదినాధ్ రిషభ్ నాధ్ మార్బుల్ విగ్రహం క్రిందగల శిలా శాసనాల మేరకు అమరావతి ఒక ప్రాచీన కాల పట్టణంగా తెలుస్తోంది. ప్రాచీన కాలంలో అంటే అశోక చక్రవర్తి కాలంలో అమరావతి మౌర్యుల సామ్రాజ్యంలో ఒక ప్రధాన భూ భాగంగా ఉండేది. 1833 సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ ప్రాంతంపై ఆధిపత్యం సాధించేముందు నిజాం రాజు దీనిని షుమారు అర్ధ శతాబ్దం పాటు పాలించాడు.  

అమరావతి ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

అమరావతి వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం అమరావతి

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? అమరావతి

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు ప్రయాణం అమరావతికి దేశంలోని ప్రధాన పట్టణాలు మరియు నగరాలనుండి రోడ్డు మార్గం కలదు. బస్సులు తరచుగా ఈ ప్రాంతానికి నడుస్తూనే ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం రైలులో అమరావతి చేరాలంటే, సెంట్రల్ రైల్వే లో కల ముంబై - కోల్ కటా మెయిన్ లైన్ నుండి చేరవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన ప్రయాణం ఈ ప్రదేశానికి నాగపూర్ సమీప విమానాశ్రయం. ఇది. 155 కి.మీ. ల దూరంలో కలదు. అమరావతి చేరాలంటే విమానాశ్రయం నుండి టాక్సీలు, క్యాబ్ లలో ప్రయాణించవచ్చు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
07 Sep,Mon
Check Out
08 Sep,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
07 Sep,Mon
Return On
08 Sep,Tue

Near by City