బీబీకా మక్ బారా ప్రసిద్ధ కట్టడం. ఔరంగాబాద్ నుండి 5 కి.మీ.ల దూరంలో కలదు. దీనిని ఔరంగజేబ్ కుమారుడు తన తల్లి బేగం రబియా దురాని జ్ఞాపకార్ధం 1678లో నిర్మించాడు. ఈ కట్టడాన్ని అటా ఉల్లా తాజ్ మహల్ పోలికలో రూపొందించాడు. చాలావరకు నిర్మాణం తాజ్ మహల్ ను పోలి ఉన్నప్పటికి దానికి దీటుగా రాణించలేకపోయింది. చివరకు ఒక చవకబారు నిర్మాణంగా మారింది. దీని నిర్మాణంలో శాండ్ స్టోన్ ఉపయోగించారు. మార్బుల్ డోం కట్టారు. సమాధి మార్బుల్ తోను ఎనిమిది కోణాల ఆకారంలోను నిర్మించారు. ఈ నిర్మాణాన్ని చూడాలంటే ఉదయం 8 గం. నుండి 6 గం. ల వరకు చూడవచ్చు. భారతీయులకు రూ. 10, విదేశీయులకు రూ. 100 ప్రవేశ రుసుము కలదు.



Click it and Unblock the Notifications