చావని బజార్ బస్తి కి 40 కి. మీ.లు దూరంలో వుంటుంది. ఈ ప్రదేశం ఒకప్పుడు బ్రిటిష్ వారి పాలన కేంద్రంగా వుండేది. బ్రిటిష్ వ్యతిరేక మొట్ట మొదటి ఉద్యమంలో ఇక్కడి ప్రజలు తిరుగు బాటు చేసి ఒక బ్రిటిష్ కమాండర్ ను ఇక్కడ హత్య గావించారు.
ఇక్కడ కల ఒక అతి పెద్ద రావి చెట్టు ఒక పర్యాటక ఆకర్షణ. తమ కమాండర్ ను హత్య చేయటం తో బ్రిటిష్ సైనికులు సుమారు 250 మంది భారతీయులను ఈ చెట్టుకు కట్టి ఉరి తీసారు. ఈ రకంగా ఇది ఒక చారిత్రక పర్యాటక కేంద్రంగా మారింది.



Click it and Unblock the Notifications