పర్యాటకులు తమ బేలూర్ విహారయాత్రలో, సమయం అనుకూలిస్తే, విష్ణు సముద్రముగా ప్రసిద్ధి గాంచిన పెద్ద సరస్సును దర్శించవచ్చు. ఈ సరస్సు పద్మరాస పర్యవేక్షణలో నరసింహ రాయల కాలములో నిర్మించారు. ఈ ట్యాంక్ స్వర్ణ యుగం గా పిలవబడె, విజయ నగర రాజుల కాలములో నిర్మించబడినది . కృష్ణ దేవరాయల కాలంలో, ఉత్పతనహళ్లి కి చెందిన బసప్ప నాయక ఈ చతుర్శ్రాకారపు సరస్సు ఉత్తరపు మెట్లను నిర్మించి, మూడు వైపులా మరి కొన్ని మెట్లను జోడించారు. ఈ మెట్ల సహాయంతో, ప్రజలు తేలిగ్గా క్రిందికి వెళ్లి రోజువారీ పవిత్ర కార్యాల కోసం పవిత్ర జలం ఉపయోగించుకుంటారు. అతను సత్రాలతో పాటు పవిత్ర తెప్పోత్సవం జరుపుకునేందుకు పుష్కరిణి మధ్యలో ఒక ద్వీప మంటపం కూడా నిర్మించాడు.



Click it and Unblock the Notifications