పర్యాటకులు తమ బేలూర్ యాత్రలో సమయం ఉంటె గ్రావిటీ పిల్లర్ తప్పక చూడాలి. మహాస్తంభం లేదా కార్తిక దీపోత్సవ స్తంభం అని పిలవబడే 42 అడుగుల ఈ స్తంభం చెన్నకేశవ ఆలయ ప్రధాన ఆకర్షణలలో ఒకటి. అక్కడ ఈ స్థూపం ఎటువంటి ఆధారం లేకుండా ఒకే రాతితో తయారు చేసిన వేదిక మీద నిలబడి ఉంది. ఈ స్థూపం దాని స్వంత బరువుపై మూడు వైపుల నిలబడి, నాలుగో వైపు నేలకు ఆనకుండ కాగితం ముక్కను దూర్చినా దూరే విధంగా ఖాళీ తో నిరాధారంగా నిలబడి ఉంచుతుంది . ఈ నిర్మాణము విజయనగర పాలన లోని వాస్తుశిల్పుల సమర్థతను, నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ స్థిరంగా, ఎత్తుగా నిలిచిపోయింది.



Click it and Unblock the Notifications