బోర్డి బీచ్ ను తరచుగా దహను - బోర్డి బీచ్ అని పిలుస్తారు. ఇది బోర్డి గ్రామానికి దగ్గరగా సుమారు 17 కి.మీ. పొడవున దహను నుండి బోర్డి వరకు పరచుకొని అందాలను చిందిస్తూంటుంది. ఈ బీచ్ స్విమ్మింగ్ చేసే వారికి ఎంతో సురక్షితంగా ఉంటుంది. సముద్రంలో ఒక కిలో మీటర్ వరకు వెళ్ళినప్పటికి నీరు నడుము వరకే వస్తుంది. ఇసుక నల్లగా ఉండి అంటుకుంటూ ఉంటుంది. బీచ్ లో కల సపోటా చెట్లు బీచ్ కు మరింత ఆకర్షణ కలిగిస్తూ పర్యాటకులకు అందంగా కనపడతాయి. ఇక్కడి సహజ అందాలే బీచ్ కు పేరు తెచ్చి పెట్టాయి. ఈ అందాలు మానవులు కల్పించిన కృత్రిమ అందాలు కావు. ఈ కారణంగానే పర్యాటకులు మరల మరల ఈ ప్రదేశానికి వస్తూంటారు. ఈ బీచ్ నిర్వహణా భాధ్యత మహారాష్ట్ర ప్రభుత్వ అటవీ సంరక్షణ శాఖ వారిదిగా ఉంది.



Click it and Unblock the Notifications