Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» బిఆర్ హిల్స్

బిఆర్ హిల్స్  - దేవాలయాలు...కొండల నడుమ ప్రశాంతత....

10

బిఆర్ హిల్స్ అంటే బిలిగిరి రంగన్న హిల్స్ అని చెపుతారు. ఈ కొండలు పడమటి కనుమలకు తూర్పు సరిహద్దులో ఉంటాయి. సరిగ్గా ఈ ప్రాంతంలో తూర్పు మరియు పడమటి కనుమలు కలుస్తాయి. వివిధ రకాల పర్యావరణం ఈ ప్రదేశంలో కనపడుతుంది. బిలిగిరి రంగన్న కొండలకు వాటి పేరు అక్కడే చిన్న కొండపై ఉన్న రంగస్వామి దేవాలయం పేరు మీదుగా వచ్చింది. ఈ కొండలు కర్నాటక రాష్ట్రంలోని చామరాజనగర్ జిల్లాలో ఆగ్నేయంగా తమిళనాడు సరిహద్దులో ఉన్నాయి.  

కొండపై ఎత్తులో కల దేవాలయం బి ఆర్ హిల్స్ ఒక యాత్రా స్ధలం. ఈ ప్రదేశంలో ఎంతో అందమైన బిలిగిరి రంగస్వామి దేవాలయం ఉంటుంది. తెల్లటి కొండ అగ్రభాగాన ఈ దేవాలయం ఉండి ఈ కొండకు బిలి గిరి గా పేరు తెచ్చింది. ఈ దేవాలయంలోని దేముడు బిలిగిరి రంగ గా పిలువబడతాడు. ఈ దేవాలయం రంగనాధస్వామి దేముడిదేనని చెపుతారు. దేముడి విగ్రహం నిలబడి తన సహచరిణి రంగనాయకితో కలిసి ఉంటుంది. ఈ దేవాలయంలో పండుగ వేడుకలు  ప్రతి సంవత్సరం ఏప్రిల్ లో జరుగుతాయి. వేలాది పర్యాటకులు ఈ వేడుకలకు హాజరై ఆనందిస్తారు.

పర్యాటకులు, స్ధానిక తెగల ప్రజలు కలిసి ఈ సమయంలో దేవాలయ ఉత్సవాలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. బయటనుండి వచ్చి ఈ వేడుకలు చూసే వారికి ఎంతో అద్భుతం అనిపిస్తుంది.  

పర్యావరణంలో అటవీ జంతువులు బిలిగిరి రంగస్వామి దేవాలయ అటవీ శాంక్చువరీని సంక్షిప్తంగా బి ఆర్ టి వైల్డ్ లైఫ్ శాంక్చువరీ అంటారు. ఇది షుమారుగా 539 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. సుమారు 5091 అడుగుల ఎత్తున ఉంటుంది. ఈ రక్షిత స్ధలం పడమటి మరియు తూర్పు కనుమలకు కూడా చెందినది. ఈ ప్రాంతంలో ఎన్నో రకాల వృక్ష జాతులు కనపడతాయి. పచ్చటి దట్టమైన అటవీ ప్రాంతాలుంటాయి. ఈ మొక్కల సంపద ఆహారంగా ఎన్నో జంతువులు ఇక్కడ జీవిస్తూంటాయి.

వైల్డ్ లైఫ్ శాంక్చువరీ కి తమిళనాడులోని ఈరోడ్ జిల్లాకు చెందిన సత్యమంగళం అడవులు సరిహద్దుగా ఉంటాయి. ఈ అడవులలో, అడవి ఎలుగులు, దున్నలు, పులులు, చిరుతలు, వేట కుక్కలు, ఏనుగులు, నాలుగు కొమ్ముల దుప్పులు ఎన్నో ఉంటాయి. ఈ రక్షిత అడవిలో 200 కు పైగా పక్షి జాతులున్నాయి.

సాహస కార్యాలు చేయాలనుకునేవారికి.... బిఆర్ హిల్స్ ట్రెక్కింగ్, ర్యాఫ్టింగ్, కావేరి మరియు కపిల నదుల పై విహారం చేయాలనుకునేవారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. చేపలు పట్టడం, బోట్ విహారం వంటివి కూడా చేయవచ్చు.

దీనిని యాత్రా స్ధలంగాను, పర్యాటక స్ధలంగాను కూడా గుర్తిస్తారు. చిన్నపాటి సెలవులు గడపాలంటే బి ఆర్ హిల్స్ ప్రదేశం ఎంతో అనుకూలం. దేవాలయం చూడాలనుకుంటే, రధోత్సవం జరిగే ఏప్రిల్ నెలలో ఈ ప్రాంతాన్ని దర్శించాలి. జంతు సంరక్షణాలయం చూడాలనుకునేవారికి వర్షాలు పడే సమయంలో జూన్ నుండి అక్టోబర్ వరకు మంచి సమయంగా ఉంటుంది.  సెలవులు గడుపుతూ విశ్రాంతి పొందాలనుకునేవారికి , ఇది ఒక మంచి ప్రదేశం.  

బిఆర్ హిల్స్ ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

బిఆర్ హిల్స్ వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం బిఆర్ హిల్స్

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? బిఆర్ హిల్స్

  • రోడ్డు ప్రయాణం
    బస్ ప్రయాణం - సమీప నగరాలు, పట్టణాలనుండి అంటే మైసూర్, కొల్లేగల్, కనకపుర, చామరాజ్ నగర్ లనుండి కర్నాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్ధ డీలక్స్, ఓల్వో మరియు సూపర్ ఫాస్ట్ టూరిస్టు బస్సులు నడుపుతుంది.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు ప్రయాణం - బిఆర్ హిల్స్ కు రైలు స్టేషన్ లేదు. 90 కి.మీ. దూరంలో మైసూర్ రైల్వే స్టేషన్ నుండి ఇక్కడికి చేరాలి. ఇక్కడనుండి టాక్సీలు, క్యాబ్ లు లభ్యంగా ఉంటాయి.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    బిఆర్ హిల్స్ ఎలా చేరాలి? విమాన ప్రయాణం - మైసూర్ విమానాశ్రయం బిఆర్ హిల్స్ కు స్ధానిక విమానాశ్రయం. ఇండియాలోని ప్రధాన నగరాలకు కలుపబడింది. ఇది బిఆర్ హిల్స్ నుండి 90 కి.మీ. ఉంటుంది. 235 కి. మీ. దూరంలో బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం కలదు. వివిధ దేశాల పర్యాటకులు దీని ద్వారా ప్రయాణిస్తారు.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed