శక్తివంతమైన, అద్భుతమైన చిత్తోర్ ఘడ్ కోట చిత్తోర్ ఘడ్ గత వైభవాన్ని వర్ణిస్తుంది. ఇది పట్టణానికి ఒక ప్రధాన పర్యాటక ఆకర్షణ.ఒక జానపథ కథ ప్రకారం మౌర్యులు ఈ కోటను 7 వ శతాబ్దం లో నిర్మించారు. 700 ఎకరాల లో విస్తరించి ఉన్న ఈ నిర్మాణం 180 మీ. ల ఎత్తులో ఒక మిట్ట పై ఉంది. గతంలో అనేక భారీ విధ్వంసాలు జరిగినప్పటికీ నిర్మాణ నైపుణ్యానికి నిదర్శనమైన ఈ కోట మిగిలే ఉంది. ఈ కోటకు వచ్చే మార్గం అంత సులభమైనది కాదు, నిటారైన, మెలికలు తిరిగిన రాచ బాట వెంబడి ఒక మైలు నడవవలసి ఉంటుంది.ఈ కోటకు దేవతల పేర్లు ఉన్న మేకులు కొట్టిన ఏడు పెద్ద ఇనుప గేట్లు ఉన్నాయి. అనేక అందమైన దేవాలయాలతో బాటుగా బ్రహ్మాండమైన రాణి పద్మిని భవనం, మహారాణ కుంభ భవనం ఉన్నాయి. సహజనీటి వనరు లేదా వర్షపు నీటి ద్వార నిండే అనేక జల వనరులు ఈ కోట లోపల ఉన్నాయి.



Click it and Unblock the Notifications