చిన్న పట్టణమైన మేనల్, చిత్తోర్ ఘడ్ కు 90 కి. మీ. దూరంలో చిత్తోర్ ఘడ్ – బుండి రహదారి పై ఉంది. రమణీయత, పురాతన దేవాలయాలతో ఈ ప్రాంతం ఖజోరహోను పోలిఉండటం వలన దీనిని చిన్న ఖజురహో అని కూడా పిలుస్తారు. ఇప్పటికే అనేక బౌద్ధ దేవాలయాలతో నిండిన ఈ ప్రాంతంలో ఇంకా దేవాలయాలను కనుగొనడానికి తవ్వకాలు కొనసాగుతూనే ఉన్నాయి. దేవాలయాలతో బాటుగా అందమైన జలపాతాలు, దట్టమైన అడవులు ఉన్న ఈ ప్రాంతం ఒక ప్రముఖ విహారయాత్రా స్థలంగా మారింది.



Click it and Unblock the Notifications