మనోహరమైన ఈ ప్రదేశం ఛర్పోరా నది ఒడ్డున ఉత్తరంగా ఉంటుంది. ఛోప్ డెం గోవాను పార్టీలు, విందులు, వినోదాలుగా కాక మరో కోణంలో చూపుతుంది. అది మతపరంగా. యాత్రికులు, చరిత్ర అభిలాషక పర్యాటకులు ఇక్కడ కల భూమిక, వేటాల్, గరుడి మరియు రాంపురుష్ దేవాలయాల పరిరక్షణను తప్పక ప్రశంసిస్తారు.
ఈ ప్రాంతంలో గెస్ట్ హౌస్ లు, లాడ్జిలు అధికంగా ఉండటం చేత, సామాన్య హోటళ్ళు తక్కువగా ఉంటాయి. ఏదో ఒక రకంగా హోటల్ వసతి సంపాదించగలిగితే మాత్రం అది చాలా బాగుంటుందనే చెప్పాలి. ఛోపడం నుండి కొంచెం దూరం బయటకు వెళితే చాలు రిసార్టులు, హోటళ్ళు మీకు కావలసినన్ని దొరుకుతాయి.
ఛోపడం చేరాలంటే, సియోలిం నుండి ఫెర్రీలో కూడా చేరవచ్చు. కొద్దిపాటి సాహసంగా కనపడుతుంది. హై వే లో ప్రయాణించేవారికి రోడ్డు బాగానే ఉంటుంది కాని అధిక సమయం పడుతుంది. ముంబై లేదా పూనే నగరాలనుండి గోవా చేరే పర్యాటకులు నార్త్ గోవా చేరే ముందుగా ఛోపడెం చూస్తారు.



Click it and Unblock the Notifications