Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కూర్గ్ » ఆకర్షణలు » అబ్బే జలపాతాలు

అబ్బే జలపాతాలు, కూర్గ్

4

అబ్బే జలపాతాలు మడికెరి పట్టణానికి 7-8 కి.మీ.ల దూరంలో కలవు. కూర్గ్ లో అబ్బే ఫాల్స్ అధికంగా చూసే ఆకర్షణలలో ఒకటి. ఈ జలపాతాలు ప్రయివేట్ కాఫీ తోటల మరియు సుగంధ ద్రవ్యాల తోటల మధ్యగా దట్టమైన పొందలలో ప్రవహించి కొండలలో చిన్న ధారగా మొదలై పర్యాటకులు చూడదగ్గ ఎత్తునుండి ఎంతో ఆకర్షణీయంగా క్రిందకు ప్రవహిస్తాయి.

జలపాతాల హోరు పర్యాటకులను ఆశ్చర్య చకితులను చేస్తుంది. ఆ ప్రాంత ప్రశాంతతనే మార్చివేస్తుంది. బ్రిటీష్ వారు ఈ జలపాతాలకు జెస్సి వాటర్ ఫాల్స్ అని పేరు పెట్టారు. మడికెరికి వారి మొదటి పాలకుడి కుమార్తె గుర్తుగా ఆ పేరుతో పిలిచేవారు. అయితే, తర్వాతికాలంలో వీటికి అబ్బే లేదా అబ్బి జలపాతాలని పేరు వచ్చింది. కూర్గు భాషలో అబ్బే అంటే జలపాతం అని అర్ధం చెపుతారు.

పడమటి కనుమలలో భాగమైన ఈ జలపాతాలు అనేక ధారల కలయిక. ఎంతో వేగంగా ప్రవహించి కొండలపైనుండి కిందకు దుముకుతాయి. ఒక చక్కటి సరస్సుగా కింద ఏర్పడుతుంది. ప్రశాంత వాతావరణం కల కూర్గ్ లో ఈ జలపాతాల  హోరు ఒక ప్రత్యేకతగా ఉంటుంది. నీరు వేగంగా కిందకు పడుతూంటే ఆ ప్రదేశం అంతా పొగమంచు వ్యాపిస్తుంది.

ఈ పొగమంచు కొండలపై వ్యాపించి చూసే వారికి ఆ ప్రాంతం మరింత అందంగా ఉండేలా  చేస్తుంది. వర్షాకాలంలో ఈ జలపాతాలు మరింత పెద్దవిగా విస్తరించి వేగంగా కదులుతూంటాయి. సాధారణంగా వేసవిలో వీటి ధార, వేగం తగ్గుతాయి. జలపాతాలకు ఎదురుగా ఒక వేలాడే వంతెన కలదు. ఈ వంతెనపైనుండి జలపాతాలను మరింత స్పష్టంగా చూసి పర్యాటకులు ఆనందిస్తారు. వంతెనకు ఆవలిపైన కాళీ మాత దేవాలయం కూడా ఉంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
30 Mar,Mon
Check Out
31 Mar,Tue
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
30 Mar,Mon
Return On
31 Mar,Tue