Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » కూర్గ్ » ఆకర్షణలు » బైలకుప్పే

బైలకుప్పే, కూర్గ్

12

బైలకుప్పే ఇండియాలో ధర్మస్ధల తర్వాత  టిబెటన్ల రెండవ అతి పెద్ద స్ధావరంగా చెప్పవచ్చు. బైల కుప్ప కుషాల్ నగర్ కు 6 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఇక్కడ రెండు టిబెట్ దీశీయుల స్ధావరాలు లగ్ సం సండూప్లింగ్ మరియు డికీ లార్సో అనబడేవి ఉన్నాయి. వీటిలో వేలాది టిబెట్ దేశీయులు శరణార్ధులుగా ఆశ్రయం పొంది జీవనం కొనసాగిస్తున్నారు.

టిబెట్ దేశాన్ని చైనీయులు ఆక్రమించిన తర్వాత టిబెట్ శరణార్ధులు వారి దేశంనుండి పారిపోయి వచ్చి ఇక్కడ స్ధావరాలు ఏర్పరచుకొన్నారు. ఈ ప్రాంతంలో వ్యవసాయం, బౌధ్ధారామాలు, హోటళ్ళు, హస్తకళా వస్తువులు వంటి వృత్తులు చేపట్టి జీవనం కొనసాగిస్తున్నారు.  బైల కుప్పేలో ప్రధాన ఆకర్షణ గోల్డెన్ టెంపుల్ లేదా నండ్రోలింగ్ మొనాస్టరీ. ఇది పూర్తిగా టిబెట్ శిల్పకళా శైలిలో నిర్మించబడింది. దక్షిణ భారత దేశంలో ఇది ఒక పెద్ద ఆకర్షణ. బంగారు రంగులో ఉన్న 40 అడుగుల పొడవైన పద్మసంభవ, బుద్ధ, అమితాయుస్ విగ్రహాలు చక్కగా అలంకరించబడి చూసేందుకు అందంగా ఉంటాయి. ప్రార్ధన సమయ బాజాలు, చక్రాలు, ద్వారాలు అన్నీ కూడా చేతి కళా వస్తువులతో అలంకరించబడినవి. దేవాలయ గోడలు టిబెట్ దేశీయ కళా శైలిలో బుద్ధుడి అవతారాలు, మరియు వారి వజ్రాయణ బుద్ధిజం దేవతలుతో నిండి ఉంటాయి.  టిబెట్ దేశీయ బౌధ్ధ మతానికి సంబంధించిన విద్యాలయాలు, సంస్ధలు కూడా ఇక్కడ ఉన్నాయి.   వీటిని సెరా మే మరియు సెరా జే మఠాలని పిలుస్తారు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Jul,Fri
Check Out
11 Jul,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Jul,Fri
Return On
11 Jul,Sat