బ్రహ్మగిరి పర్వత శ్రేణిలో దక్షిణ కూర్గ్ లో ఇరప్పు జలపాతాలు కలవు. వీటినే లక్ష్మణ తీర్ధ జలపాతాలంటారు. ఇవి కావేరి ఉపనదినుండి ఆవిర్భవిస్తాయి. నది 60 అడుగుల ఎత్తునుండి పడి జలపాతాలను సృష్టిస్తోంది. విరాజ్ పెటకు 48 కి.మీ.లు మరియు మడికెరికి 80 కి.మీ.ల దూరంలో నాగర్ హోల్ హైవే లో కలవు. రామేశ్వర దేవాలయం వీటికి సమీపంలో కలదు. శ్రీరాముడి దాహం తీర్చటానికి ఈ నీటిని లక్ష్మణుడు సృష్టించాడని హిందువులకు ఎంతో పవిత్రమైనదని చెపుతారు. మహా శివరాత్రికి భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ జలపాతాలు వర్షాకాలంలో పూర్తి స్ధాయిలో ప్రవహించి యాత్రికులను ఆనందపరుస్తాయి. జలపాతాలపైకి ఎక్కేందుకు మెట్లు కలవు. వివ్రాంతికై ఇక్కడే బెంచీలు కూడా కలవు. ఎన్నో చెట్లు, పొదలు, జలపాతాల హోరు పర్యాటకుడికి మరచిపోలేని అనుభూతి కలిగిస్తుంది.



Click it and Unblock the Notifications