పుష్పగిరి వైల్డ్ లైఫ్ శాంక్చురి సోమవార్ పేట తాలూకాలో కలదు. కనుమరుగవుతున్న అనేక పక్షి జాతులకు నివాసంగా ఉంది. ప్రపంచంలోని అరుదైన పక్షులు ఇక్కడ కనపడతాయి. ఈ శాంక్చురీలో కదమక్కాల్ రిజర్వు ఫారెస్టు ఒక భాగం. దీనికి పడమటి భాగంలో కుక్కే సుబ్రమణ్య కనపడుతుంది. శాంక్చురీ ఎత్తు వివిధ ప్రదేశాలలో 160 మీ. ల నుండి 1712 మీ. ల వరకు ఉంటుంది. అత్యధిక ఎత్తు కలది పుష్పగిరి కొండ. శాంక్చురీలో కుమారపర్వత శిఖరం కూడా ఉంటుంది. దీనిలో అనేక కొలనులు, జలపాతాలు కలవు. కర్నాటకలోని అడవీ ప్రాంతంలో అధిక భాగం ఇక్కడే కలదు. పచ్చటి ప్రదేశాలు, దట్టమైన చెట్ల సమూహాలు అనేక వన్య జీవులకు ఆవాసమిస్తున్నాయి. వివిధ రకాల వన్య జీవులను సందర్శించవచ్చు. జంతువులే కాక వివిధ రకాల పక్షులు కూడా ఈ శాంక్చురీలో ఉండటం విశేషంగా భావిస్తారు. సాధారణ తాచు పాము, ఇండియన్ రాక్ కొండ చిలువ, ర్యాట్ స్నేక్, ఆలివ్ కీల్ బ్యాక్, కింగ్ కోబ్రా , బాంబూ పిట్ వైపర్ వంటివి కూడా ఇక్కడి ప్రదేశాలలో నివసిస్తాయి.



Click it and Unblock the Notifications