భారత దేశానికీ అలాగే నేపాల్ కి ప్రముఖమైన నదులలో ఒకటి కోసి నది. ఈ నదీ పరివాహక ప్రాంతం చుట్టూ ఎత్తైన కొండలు ఉంటాయి. ఈ కొండలు ఉత్తరం వైపు ఉన్న యార్లుంగ్ త్సంగ్పో నది నుండి ఈ నదిని విభజిస్తాయి. సప్తకోషి లేదా కోషి గా పిలువబడే ఈ కోసి నది గత 250 ఏళ్ళల్లో తూర్పు నుండి పడమరకు 120 కిలో మీటర్ల మేరకు చేరుకుంది. ఋగ్వేదం లో, ఈ నదిని కౌసిక గా సంభోదించారు. మహాభారతం లో కౌసికి గా ఈ నది గురించి పేర్కొన్నారు. సప్త నదుల సంగమమే సప్తకోషి నది అని మహాభారతం లో ప్రస్తావించారు.
ఫిషింగ్ ని ఆనందించే అవకాసం కోసి నది పర్యాటకులకి అందిస్తుంది. ఫిషింగ్ చేయడానికి అనుకూల సమయం అక్టోబర్ టు డిసెంబర్ మరియు ఫిబ్రవరి టు జూన్. సంబంధిత అధికారుల నుండి అనుమతులని ఏర్పాటు చేసి కోసి నది లో పర్యాటకులకి ఫిషింగ్ చేసే సౌకర్యాన్ని వివిధ రిసార్ట్స్ లు అందిస్తున్నాయి. వర్షాకాలం లో ఈ నదీ జలం స్థాయి బాగా పెరుగుతుంది. ఎన్నో బండరాళ్ళు ఈ నదిలో కనిపిస్తాయి. అందువల్ల ఈ నదీ ప్రవాహం తరచూ మారుతూ ఉంటుంది. వర్షాకాలం లో బీహార్ మరియు బంగ్లాదేశ్ ప్రాంతాల్లో ఈ నది వల్ల వరదలు ఏర్పడుతూ ఉంటాయి.