Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » జంతర్ మంతర్

జంతర్ మంతర్, ఢిల్లీ

5

జంతర్ మంతర్, ఢిల్లీలోని చాల ఆసక్తికరమైన ‘తప్పక చూడవలసిన’ ఒక ఆకర్షణ. ఇది కొన్ని ప్రత్యేక ఖగోళ సంబంధ సాధనాలు ఉన్న ప్రసిద్ధ పరిశోధన శాల, దీనిని ఆధునిక ఢిల్లీ నగర౦లో చూడవచ్చు.

1724 వ సంవత్సరంలో నిర్మించబడిన జంతర్ మంతర్ రెండవ జై సింగ్ మహారాజు కట్టిన అటువంటి ఐదు ప్రదేశాలలో ఇది ఒకటి. పంచాంగం, జ్యోతిష్య శాస్త్ర పట్టికలను సవరి౦చమని అడిగిన మొఘల్ చక్రవర్తి మొహమ్మద్ షా కోసం మహారాజుగారు ఈ పనిని చేపట్టారు. జ్యోతిష్య శాస్త్ర పట్టికలు తయారీ, సూర్యుడు, చంద్రుడు, గ్రహాల కదలికలను అంచనా వేయడం వంటి లక్ష్యాల కోసం నిర్మించిన జంతర్ మంతర్లో మొత్తం 13 ఆసక్తికరమైన ఖగోళ సంబంధ సాధనాలు ఉన్నాయి.

జంతర్ మంతర్ పేరుతోనే జై సింగ్ నిర్మించిన ఇతర ఐదు పరిశోధనాశాలలు జై పూర్, వారణాశి, ఉజ్జయిని, మథురలలో చూడవచ్చు. అయితే, ఈ సాధనాలతో ప్రస్తుతం ఖచ్చితంగా ఏ పరిశోధన చేయలేక పోయినప్పటికీ, మొత్తం ఐదు భారతదేశంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణలే కాక ఖగోళ శాస్త్రంలో ఎంతో ప్రాముఖ్యత కల్గినవి.

పరికరాల గురించి జంతర్ మంతర్ లోని కొన్ని ప్రత్యేక పరికరాలలో ఈ క్రిందివి ఉన్నాయి: రాం యంత్రం, మిశ్ర యంత్రం – భూగోళంలోని అనేక ప్రాంతాలలో మధ్యాహ్న౦గా  మార్పు చెందడాన్ని సూచించే పని చేసే నిర్మాణం, సామ్రాట్ యంత్రం – ఒక బ్రహ్మాండమైన 70 అడుగుల ఎత్తైన పరికరం వాస్తవానికి సూర్యగడియారానికి సమానం, జయప్రకాశ్ యంత్రం ఒక నక్షత్ర స్థానాన్ని సర్దుబాటు చేసే లక్ష్యంతో నిర్మించారు.  పార్లమెంట్ వీధిలోని  జంతర్ మంతర్  ప్రజల సందర్శనార్ధం అన్ని రోజులలో తెరిచే ఉంటుంది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Sep,Wed
Check Out
10 Sep,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Sep,Wed
Return On
10 Sep,Thu