మోత్ అనగా తెలుగులో ఉలవలు అని అర్ధం. సుల్తాన్ సికందర్ లోడి రాజ్యంలో ప్రధాన మంత్రిగా పనిచేసిన వజీర్ మియా భోయియా చే ఈ మశీదు 1505 లో నిర్మించబడినది. వివిధ ప్రాంతలలో సాగు చేసిన ఉలవల వల్ల వచ్చిన ధనాన్ని ఈ మశీదు నిర్మాణం కొరకు ఉపయోగించారు. అందుకే దీనికి ఆ పేరు వచ్చింది. మొట్టమొదటిసారి ఉలవ గింజలని సికందర్ లోఢీ ప్రధానమంత్రి కి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మశీదుకి శంఖుస్థాపన సికందర్ లోఢీ చేసాడని, ఇది మియా భోయా ఉపయోగం కొరకు మాత్రమే నిర్మించినది అని తెలుస్తోంది.
ఈ మసీదు ఇండో-ఇస్లామిక్ వాస్తు కళకి ఈ మశీదు ప్రతీక. ఎర్రని రాతితో నిర్మించబడిన ఈ మశీదుకి జాలీ పని తనంతో నిండిన కిటికీలు, అష్టభుజ చిహ్నాలు (అస్థికలు వేరోక చోట ఉన్నవారికోసం నిర్మించే ఖాళీ సమాధి),చిన్న అర్ధ వ్రుత్తాకారపు పైకప్పు,రెండస్తుల బురుజు ప్రత్యేక ఆకర్షణలు. పూల డిజైన్లతో తీర్చిదిద్దబడిన ఈ మశీదు అందాన్ని చూసి తీరవలసినదే. ఢిల్లీలోని ఇస్లామిక్ కట్టడాలన్నీ ఎర్ర ఇసుకతో నిర్మించినవే కావడం గమనార్హం.
ఇతర మశీదుల వలే ఇందులో మినార్ (సన్నటి బురుజు లాంటి కట్టడం), నగీషీ వ్రాత అలంకరణలు కానీ, మరే ఇతర హంగులూ ఉండవు. కానీ దీని వాస్తు కళే సందర్శకులని ఆకర్షిస్తూ ఉంటుంది. సూర్యోదయం నుండీ సూర్యాస్తమయం వరకూ తెరిచి ఉండే ఈ మశీదులోకి ప్రవేశించడానికి ఎటువంటి రుసుమూ చెల్లించనక్కర్లేదు.



Click it and Unblock the Notifications