ఢిల్లీ లోని పురాతన కోటకు సమీపంలో కల నేషనల్ జూలాజికల్ పార్క్ 214 ఎకరాల విస్తీర్ణం కలిగి ఒక సంరక్షిత ప్రదేశం గా నిర్వహించబడుతోంది. . ఈ జంతు ప్రదర్శన శాల లో ప్రపంచ వ్యాప్తం గా కల జంతువులు మరియు పక్షులలో సుమారు సగటున 130 జాతుల కు చెందిన 1350 జంతువులు కలవు.
ఈ జంతు ప్రదర్శన శాలను 1959 సంవత్సరం నవంబర్ 1 వ తేదీన 'ఢిల్లీ జంతుప్రదర్శన శాల' గా ఆవిష్కరించారు,. అయితే, తర్వాతి కాలంలో దీనిని ఇండియా లోని ఇతర ప్రదేశాల జూ లకు ఆదర్శంగా వుండాలని 'నేషనల్ జూలాజికల్ పార్క్ ' గా పేరు మార్చారు. . ఈ జూ ని నిర్వహించటం లో కల ఉద్దేశ్యం సాధారణ ప్రజలలో మరియు పర్యాటకులలో ప్రకృతి సంరక్షణ పట్ల ఒక అవగాహన ఏర్పరచటమే .
ఇక్కడి వన్య జంతువులను పరిశీలిస్తే, అవి చింపాంజీ, స్పైడర్ మంకీ , ఆఫ్రికన్ అడవి ఎద్దు, గిర్, సింహం, కొండముచ్చు, లేడి , జింక, ఇంకా ఇతర జంతువులు, పక్షులు, మరియు నీటి జంతువులు వుంటాయి. ఈ పార్క్ లో ఒక అండర్ గ్రౌండ్ పాములా గది కూడా కలదు. వీతిలీ వివిధ రకాల పాములు మరియు, ఇతర సరీనృపాలు వుంటాయి.
ఈ జూ సెంట్రల్ జూ అధికారులతో కలసి, రాయల్ బెంగాల్ టైగర్, ఇండియన్ రీనో చీరోస్, స్వామ్ప్ డీర్, ఆసియాటిక్ లయన్, రెడ్ జంగల్ ఫౌల్, మొదలైన జంతువులను సంరక్షిస్తుంది.
ఈ జూ శుక్రవారాలు తప్ప, మిగిలిన అన్ని రోజులు ఉదయం 8.30 గం. నుండి సాయంకాలం 5.30 గం. వరకు తెరచే వుంటుంది. చలికాలం లో ఉదయం 9.30 గం. నుండి సాయంత్రం 4.30 గం. వరకు తెరచి వుంటుంది. ఎంట్రీ ఫీసు రూ.5 కాగా విదేశీయులకు రూ.100 గా వుంటుంది. జూ లో ఒక కాఫీ హౌస్ మరియు, జూ అంతా చూపేందుకు ఒక ఓపెన్ వాన్ కూడా కలవు.



Click it and Unblock the Notifications