Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » ఢిల్లీ » ఆకర్షణలు » ప్రగతి మైదాన్

ప్రగతి మైదాన్, ఢిల్లీ

4

ప్రగతి మైదాన్ ఢిల్లీలోని అతి పెద్ద ప్రదర్శన కేంద్రం మరియు ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణగా ఉంది . కేంద్ర వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ యొక్క వాణిజ్య ప్రోత్సాహక సంస్థ అయిన “భారత వాణిజ్య ప్రోత్సాహక సంస్థ” (ఇండియన్ ట్రేడ్ ప్రమోషన్ ఆర్గనైజేషన్ - ఐ.టి.పి.ఓ) చేత నిర్వహించబడి సంరక్షించబడుతున్నఈ 72,000 చదరపు మీటర్ల ప్రదర్శన ప్రాంతం ఢిల్లీ లో జరిగే వివిధ ముఖ్య సమ్మేళనాలు మరియు అంతర్జాతీయ ప్రదర్శనలకు వేదిక గా నిలుస్తుంది.

1982 లో స్థాపించబడిన ప్రగతి మైదాన్ ప్రసిద్ధి చెందిన పాత కోట (పురానా ఖిల్లా)కి ఎదురుగా ఉంది.ఇందులో 61,290 చదరపు మీటర్ల పైన కప్పబడిన ప్రదర్శన ప్రాంతం మరియు 10,000 చదరపు మీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉన్న బహిరంగ ప్రదర్శన ప్రాంతం ఉన్నాయి. మొత్తం సముదాయంలో 18 ప్రదర్శన మందిరాలు, వివిధ భవనాలు, భోజన గృహాలు, ప్రదర్శన ప్రదేశాలు మరియు ఐ.టి.పి.ఓ యొక్క ప్రధాన కార్యాలయం ఉన్నాయి.

ప్రతి సంవత్సరం ప్రగతి మైదాన్ సుమారు 70 జాతీయ మరియు అంతర్జాతీయ సమ్మేళనాలకి ఆతిథ్యం ఇస్తుంది. వీటన్నింటిలో ప్రసిద్ధి చెందిన వార్షిక భారత అంతర్జాతీయ వాణిజ్య ఉత్సవము అత్యంత పెద్దది. సుమారు 30,000 మంది వీక్షకులు, 10000 మంది ప్రదర్శకులని ఇది ఆకర్షిస్తుంది.వాహన సమ్మేళనం (ఆటో ఎక్స్పో) మరియు ప్రపంచ పుస్తక ప్రదర్శన ( వరల్డ్ బుక్ ఫెయిర్) ఇక్కడి ఇతర ముఖ్య ప్రదర్శనలు.

ప్రగతి మైదాన్ అనగా అభివృద్ధి క్షేత్రం. ఇక్కడ రక్షణ మండపం (డిఫెన్స్ పెవిలియన్),నెహ్రు పెవిలియన్,భారత పుత్ర మండపం (సన్ ఆఫ్ ఇండియా పెవిలియన్) మరియు ఇందిర పెవిలియన్ లాంటి వివిధ మండపాలు ఉన్నాయి. మైదాన్ లో వివిధ రాక్ ప్రదర్శనలకి తరచూ వేదిక గా నిలిచే ఒక సభాభవనం (ఆడిటోరియం) కూడా ఉంది.

ప్రతి సంవత్సరం ఢిల్లీ లో ఇక్కడే ఆదాయ పన్ను విభాగం ఆదాయ పన్ను రాబడి దాఖలు చెయ్యడాని కోసం సుమారు 150 దుకాణాలు పెడుతుంది. ఇంకా, 2008 మరియు 2009 సంవత్సరాలలో ఇదే మైదాన్ లో ఫ్యాషన్ రూపకల్పన మండలి (ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ – ఎఫ్. డి. సి) యొక్క ప్రసిద్ధ విల్స్ లైఫ్ స్టైల్ ఇండియన్ ఫాషన్ వీక్ నిర్వహించబడింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
11 Mar,Wed
Check Out
12 Mar,Thu
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
11 Mar,Wed
Return On
12 Mar,Thu