తీన్ మూర్తి భవన్ నె తీన్ మూర్తి హౌస్ అని కూడా అంటారు. ఇది బ్రిటిష్ కమాండర్ ఇన్ చీఫ్ నివాసం. అంతేకాదు ఇది భారత దేశ మొట్ట మొదటి ప్రధాన ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రు కు ఆయన జీవితం లోని చివరి 16 సంవత్సారాలు ఆయనకు నివాసం గా కూడా కలదు.
తీన్ మూర్తి భవనాన్ని 1930 సంవత్సరం లో ఇంపీరియల్ ఇండియా కొత్త రాజధాని నిర్మాణం లో భాగంగా నిర్మించారు. జవహర్లాల్ నెహ్రు మరణం తర్వాత దీనిని ఒక స్మారకం గా మార్చారు. బ్రిటిష్ సిల్పకారుడు లియోనార్డ్ జెన్నింగ్స్ ఈ హౌస్ లో పెట్టిన మూడు విగ్రహాల కారణంగా దీనిని తీన్ మూర్తి భవన్ అన్నారు. ఈ భవన నమూనా ప్రఖ్యాత బ్రిటిష్ ఆర్కిటెక్ట్ రాబర్ట్ తార రస్సేల్ రూపొందించారు.
దీనిలో నెహ్రు మెమోరియల్ లైబ్రరీ, భారతీయ చరిత్ర పై ఒక రీసెర్చ్ సెంటర్ కలవు. ఎంతో ఖ్యాతి గాంచిన గొప్ప వ్యక్తుల పరిశోధనా పేపర్లు ఇక్కడ మీకు లభిస్తాయి. నెహ్రు కుటుంబానికి సంబంధించిన అనేక ఫోటోల ఆల్బం లు ఆయన రాసిన లేఖలు, ఆయన వ్యక్తిగత వస్తువులు ఇక్కడ ఉంచారు. ఈ భావన సముదాయం లోనే నెహ్రు ప్లానె టోరియం కూడా కలదు. ఈ కాంప్లెక్స్ 1964 లో అప్పటి భారత రాష్ట్రపతి డా. ఎస్ రాధాకృష్ణన్ ఆధ్వర్యం లో స్థాపించిన జవహర్లాల్ నెహ్రు మెమోరియల్ ఫండ్ కు ప్రధాన కార్యాలయం గా కూడా పని చేస్తుంది.
ఈ కాంప్లెక్స్ రాష్ట్రపతి భవన్ కు సమీపం లో కలదు. సోమవారాలు తప్ప అన్ని రోజుల లోను ఉదయం 9 గం. నుండి సా . 5.౩౦ గం. వరకు తెరచి వుంటుంది. ఎంట్రీ రుసుము లేదు. దీనికి సమీపంలో రేస్ కోర్స్ స్టేషన్ కూడా కలదు.



Click it and Unblock the Notifications